రష్మికను టచ్ చేసిన అభిమాని.. హీరోయిన్ ఎలా రియాక్ట్ అయిందో చూడండి
అందంతో పాటు అభినయం ఉన్న నటీమణుల్లో రష్మిక మందన్నా ఒకరు. యంగ్ హీరో నాగశౌర్య నటించిన 'ఛలో' ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఆమె.. ఆ తర్వాత యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండతో వరుసగా రెండు సినిమాల్లో నటించింది. అందులో ఒకటి 'గీత గోవిందం' కాగా, రెండోది తాజాగా వచ్చిన 'డియర్ కామ్రేడ్'. భరత్ కమ్మ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. జులై 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఇందులో రష్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. సినిమా చూసిన వారంతా ఆమెను కొనియాడుతున్నారు. దీంతో ఈ కన్నడ భామ ఖుషీగా ఉంది.
'డియర్ కామ్రేడ్'లో రష్మిక లిల్లీ అనే క్రికెట్ ప్లేయర్‌గా కనిపించింది. ఈ సినిమా కోసం ఆమె ఎంతగానో కష్టపడింది. ఈ పాత్రకు న్యాయం చేయాలని నాలుగు నెలలు క్రికెట్ ప్రాక్టీస్ చేసింది. ఈ కష్టమంతా సినిమాలో కనిపించింది. ఈ కారణంగానే రష్మిక నటకు మంచి మార్కులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెకు ఓ అభిమాని ట్వీట్ చేశారు. 'చాలా రోజుల తర్వాత ఓ ఫీమేల్ క్యారెక్టర్ చూసి పడిపోయాను. లిల్లీ అనే పాత్ర ఎమోషనల్‌గా నాకు బాగా కనెక్ట్ అయింది. నేను థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆమె నా హృదయంలో ఉండిపోయింది' అని అందులో పేర్కొన్నారు.

తన అభిమాని చేసిన పోస్టుకు రష్మిక స్పందించింది. 'ఇది నన్ను టచ్ చేసింది. థ్యాంక్యూ' అని ఆమె రిప్లై ఇచ్చింది. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం రష్మిక మహేశ్ బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు'తో పాటు నితిన్ 'భీష్మ', అల్లు అర్జున్ సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు ఓ కన్నడ చిత్రానికీ ఆమె సంతకం చేసేంది. ఇవన్నీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications











