ఇక ఆపు.. అందరూ చూస్తున్నారు.. రష్మిక మందన్న షాకింగ్ రియాక్షన్

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న క్రేజీ జోడీ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'డియ‌ర్ కామ్రేడ్‌'. నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జులై 26 వ తేదీన విడుదలైన బాక్సాఫీసు వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. కాగా తాజాగా ఈ సినిమా విషయమై రష్మిక మందన్న, ఆమె తల్లి మధ్య జరిగిన సోషల్ మీడియా సంభాషణ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ ఇద్దరూ మాట్లాడుకున్నదేంటి? ఇలా వార్తల్లో ఎందుకు నిలిచారు? వివరాలు చూస్తే..

 డియ‌ర్ కామ్రేడ్‌ డీసెంట్ రన్

డియ‌ర్ కామ్రేడ్‌ డీసెంట్ రన్

విడుదలకు ముందు భారీ బజ్ క్రియేట్ చేసుకున్న డియర్ కామ్రేడ్ మూవీ.. ఆ అంచనాలను అందుకోలేక పోయిందనే టాక్ వినిపిస్తోంది. సినిమా రన్ టైమ్ ఎక్కువగా ఉండటం, స్లో నేరేషన్ వల్ల ప్రేక్షకులు కాస్త అసహనానికి గురవుతున్నట్లు తెలిసింది. అయినప్పటికీ విడుదలైన అన్ని సెంటర్లలో డీసెంట్ రన్ కొనసాగిస్తుండటం కారణంగా చిత్రయూనిట్ సంతోషంగా ఉంది.

 సినిమా చూసిన రష్మిక మందన్న తల్లి

సినిమా చూసిన రష్మిక మందన్న తల్లి

హీరోయిన్ రష్మిక మందన్న తల్లి సుమన్ 'డియ‌ర్ కామ్రేడ్‌' సినిమా చూసింది. వెంటనే చిత్రంలో రష్మిక నటన పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ రష్మికను పొగడ్తల్లో ముంచెత్తింది. ఈ మేరకు రష్మిక, ఆమె తల్లి మధ్య జరిగిన సోషల్ మీడియా సంభాషణ ఆసక్తికరంగా మారింది.

 లవ్‌ యూ బేబీ రష్మిక

లవ్‌ యూ బేబీ రష్మిక

లిల్లీ తన తల్లిదండ్రులు గర్వపడేలా చేసిందని, తాను ఎంచుకున్న రంగంలో ఇలా వృద్ధి చెందుతుంటే చాలా ఆనందంగా ఉందని పేర్కొంటూ.. లవ్‌ యూ బేబీ రష్మిక. నిజంగా అద్భుతంగా నటించావు. నీ తదుపరి చిత్రాలకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నా. అలాగే మైత్రి మూవీ మేకర్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు అని రష్మిక తల్లి సుమన్ తన ట్వీట్ లో పేర్కొంది.

లవ్‌ యూ టూ అంటూ రష్మిక

లవ్‌ యూ టూ అంటూ రష్మిక

లవ్‌ యూ టూ అమ్మా.. ఇప్పుడు మా టీంతో కలిసి మరోసారి సినిమా చూడు. న్యూ వెర్షన్‌ ఎలా ఉందో చెప్పు అని తల్లి చేసిన ట్వీట్ పై రిప్లై పెట్టింది రష్మిక. దీనిపై తిరిగి స్పందించిన సుమన్.. మా ఆశీర్వాదాలు నీపై ఎప్పుడూ ఉంటాయి. నటిగా ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తూ అందరి సంతోషం కోసం ఇలానే కష్టపడు అని పేర్కొంది.

కాస్త ఆపు.. అందరూ చూస్తున్నారు

కాస్త ఆపు.. అందరూ చూస్తున్నారు

ఈ ట్వీట్ సంభాషణ ఇలా కొనసాగుతుంటే రష్మిక షాకింగ్ రియాక్షన్ ఇచ్చి సంభాషణను ముగించింది. ''అమ్మా.. నీ దగ్గర ఫోన్‌ ఉందనే విషయాన్ని మరిసిపోయావా? నాకూ ఓ ఫోన్‌ ఉంది. నేను తీరికగా ఉన్నాను కాల్‌ చెయ్‌. నెటిజన్లు ట్వీట్లు చూస్తున్నారు. వారికి ఇబ్బందికరంగా ఉంటుంది'' అని రష్మిక పేర్కొంది. అలా వారిద్దరి చాటింగ్ ముగిసింది.

డియర్ కామ్రేడ్ మూవీ

డియర్ కామ్రేడ్ మూవీ

భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని సంయుక్త‌ంగా నిర్మించారు. చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కెమిస్ట్రీ ప్రేక్షక లోకాన్ని బాగా ఆకట్టుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X