నానితో ఎక్కువ.. నాగ్‌తో తక్కువ.. నా బ్రేకప్ ఎలా జరిగిందో చెప్పను: రష్మిక
ఛలో చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ప్రవేశించిన రష్మిక మందన్న గీతా గోవిందం చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రం తర్వాత ఆమె రేంజ్ మరో మెట్టు ఎక్కింది. తాజాగా నాగార్జున, నానితో రూపొందిన మల్టీస్టారర్ చిత్రం దేవదాస్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న నేపథ్యంలో రష్మిక మీడియాతో ముచ్చటించింది. ఈ సినిమా గురించి, పాత్ర గురించి, నాగ్, నానితో కలిసి నటించడం ద్వారా కలిగిన అనుభూతిని ప్రేక్షకులతో పంచుకొన్నారు. ఇంకా ఏమన్నారంటే...

సరదాగా జీవితాన్ని గడిపే
దేవదాస్ చిత్రంలో నా రోల్ పేరు పూజ. టెన్షన్లు లేకుండా సరదాగా జీవితాన్ని గడిపే చలాకీ అమ్మాయిగా కనిపించబోతున్నాను. తెరపైన రోల్ ప్రేక్షకులకు కొత్త అనుభూతి, ఆశ్చర్యకరంగా ఉంటుంది. స్క్రీన్ మీద చూస్తే చాలా థ్రిల్‌గా దఉంటుంది.

నానితో ఎక్కువ.. నాగ్‌తో తక్కువ
కథపరంగా నాగార్జున సర్‌తో చాలా తక్కువ రోజులు, నానితో ఎక్కువ రోజులు షూటింగ్ చేసే అవకాశం లభించింది. షూటింగ్ సందర్భంగా ఎలాంటి సందేహాలు వచ్చిన వారిని అడిగేదానిని. నాగ్‌తో కేవలం రెండు రోజులు షూటింగ్ చేశా. నాగ్‌సర్ పక్కనుంటే అందరూ ఏదో ఎనర్జీ వచ్చినట్లుగా ఫీలవుతారు.

నాగ్ సర్‌కు బాడీగార్డుగా
దేవదాస్ చిత్రంలో ఓ సన్నివేశంలో నాగ్ సర్‌కి బాడీగార్డ్‌గా పనిచేశాను (నవ్వుతూ). ఆయనతో ఎవరైనా సెల్ఫీ తీసుకోవాలంటే ముందు నా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. నేను అనుమతి ఇస్తేనే నాగార్జునగారితో సెల్ఫీ తీసుకొనే ఛాన్స్ వస్తుంది.

బ్రేకప్ గురించి..
బ్రేకప్ గురించి మీకు ఈ పరిస్థితుల్లో ఇలాంటి చెప్పలేను. ఇది సినిమా ప్రమోషన్. కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లడితే సినిమా ప్రమోషన్ దారితప్పుతుంది. నా బ్రేక్ గురించి సోషల్ మీడియాలో అభిమానులకు చెప్పాను. ఇంకా ఏమైనా అవసరం ఉంటే అక్కడే వెల్లడిస్తాను. నా పర్సనల్ విషయాలను సినిమా ప్రమోషన్‌లో వెల్లడించడం మించిది కాదు.


Click it and Unblock the Notifications











