నేనైతే ఉరి.. రక్షిత్‌తో స్వచ్ఛమైన ప్రేమ కాదా? ఆ హీరోతో డేటింగ్ వల్లనే.. రష్మికపై నెటిజన్ల ఫైర్
కన్నడ భామ రష్మిక మందన్న వరుస విజయాలు, సినిమాలతో కెరీర్‌ను బ్రహ్మండంగా మలచుకొంటున్నది. విజయ్ దేవరకొండ, విజయ్ లాంటి హీరోలతో జతకడుతున్న భామను ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ ఆమెను టార్గెట్‌గా చేసుకొంటున్నట్టు కనిపిస్తున్నది. తాజాగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఇలా జరిగింది.. వివరాల్లోకి వెళితే..

స్వచ్ఛమైన ప్రేమ అంటూ రష్మిక
ప్రస్తుతం నేను అనుభవిస్తున్న రోజులు నిజంగా ప్రేమతో కూడినవని అనిపిస్తున్నది. ఈ క్షణాలు స్వచ్చమైన ప్రేమను పరీక్షిస్తున్నాయి. ప్రస్తుతం నన్ను ఎవరు ఎంతగా ప్రేమిస్తున్నారో.. నన్ను ఎంత బాగా చూసుకొంటున్నారో అర్థం అవుతున్నది. వారు కూడా ఈ ప్రపంచంలో నా ప్రేమను పొందడానికి అర్హులు. నిన్ను ఎవరు ప్రేమించరో వారిని సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తాం అని రష్మిక ట్వీట్ చేసింది.

రక్షిత్ శెట్టితో ప్రేమ నిజం కాదా?
స్వచ్ఛమైన ప్రేమ అంటూ రష్మిక చేసిన కామెంట్లపై నెటిజన్లు ప్రతికూలంగా స్పందించారు. ఈ కామెంట్ల నేపథ్యంలో రక్షిత్ శెట్టిని వివాదంలోకి లాగారు. రక్షిత్ శెట్టితో అఫైర్ నిజమైన ప్రేమ కాదా? మీరు పోవడానికి నిజమైన ప్రేమ లేకపోవడమా? అంటూ ప్రశ్నల పరంపర కొనసాగింది.

విజయ్ దేవరకొండతో డేటింగ్ వల్లనే
హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్ వల్లనే ఇలాంటి కామెంట్లు చేస్తున్నావా? అని కొందరు నెటిజన్లు కామెంట్లు విసిరారు. విజయ్ దేవరకొండతో కలిసి వరుసగా గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు చేస్తుండటంతో సోషల్ మీడియాలో రష్మిక ఆయనతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

రక్షిత్ వల్లనే నీకు ఈ లెవెల్ అంటూ
స్వచ్ఛమైన ప్రేమ అంటూ ట్వీట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. నీవు మంచిదానివైతే ఇలా ట్వీట్లు చేయవు. ఒకసారి కిరిక్ పార్టీ సినిమా చూడు. కేవలం రక్షిత్ శెట్టి కారణంగా నీ లెవెల్ ఇలా మారింది. అతడు నీ గురించి ఎక్కడైనా, ఎప్పుడైనా ఇలా స్పందించాడా? అని కొందరు నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.

నేనైతే ఉరి తీసే వాడిని
నీతో బ్రేకప్ తర్వాత రక్షిత్ శెట్టి చాలా హుందాగా ప్రవర్తించాడు. తను నీ మీద ఒక్క కామెంట్ కూడా చేయడా అంటే చేయలేదు అని చెప్తాను. నీవు చేసిన పనికి ఆయన స్థానంలో నేను ఉంటే.. నేను నిన్ను ఉరి తీసే ఉండే వాడిని. షేమ్ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. (tweet).

రక్షిత్ శెట్టి హ్యాపీగా ఉన్నాడు
మనకు లభించే అవకాశాల కారణంగానే ఓ అభిప్రాయానికి వస్తాం. మనం ఎంపిక చేసుకొనే అంశాలను బట్టే ఫలితాలు వస్తాయి. కొన్ని త్యాగాలు నిజంగా విలువైనవా అంటే కాలమే సమాధానం చెబుతుంది. నీ తదుపరి చిత్రాలు కూడా సక్సెస్ కావాలని కోరుకొంటాం. నీవు రక్షిత్ గురించి బెంగపడకు. అతను లక్షలాది మంది ప్రేమకు పాత్రడయ్యాడు. అతను చాలా హ్యాపీగా ఉన్నాడు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

విజయ్ దేవరకొండతో లిప్ లాక్‌పై
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్‌లో వారిద్దరూ పెట్టుకొన్న లిప్ లాక్ వైరల్ అయింది. రష్మిక, విజయ్ లిప్‌లాక్‌పై కన్నడ ప్రేక్షకుల నుంచి దారుణంగా విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో గీతా గోవిందం సమయంలో కూడా ఇలానే దారుణంగా ట్రోల్స్ చేయడం తెలిసిందే.


Click it and Unblock the Notifications











