twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రష్మికపై రెచ్చిపోతున్న కన్నడ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్!

    |

    క్రేజీ హీరోయిన్ రష్మిక మరోమారు నెటిజన్లకు టార్గెట్ గా మారింది. ఛలో, గీత గోవిందం చిత్ర విజయాలతో రష్మికకు టాలీవుడ్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. యువతకు రష్మిక బాగా కనెక్ట్ అయింది. గీత గోవిందం తర్వాత రష్మీ దేవదాస్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించాలేదు. ప్రస్తుతం మరోమారు విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలయింది. తెలుగు ఆడియన్స్ నుంచి ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది కానీ కన్నడ అభిమానులు మాత్రం రష్మికపై ఫైర్ అవుతున్నారు.

    ఘాటుగా ముద్దు

    ఘాటుగా ముద్దు

    గీత గోవిందం చిత్రంలో రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీకి అద్భుతమైన స్పందన వచ్చింది. దీనితో గీత గోవిందం చిత్రం వసూళ్ల పరంగా ఘనవిజయం సాధించింది. ఇదిలా ఉండగా డియర్ కామ్రేడ్ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక రొమాన్స్ ఘాటు మరింత పెంచారు. కేవలం ఒక ఫైట్.. రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య ముద్దుతో ఉన్న టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    రష్మికపై ట్రోలింగ్

    రష్మికపై ట్రోలింగ్

    డియర్ కామ్రేడ్ టీజర్ తో రష్మిక కన్నడ అభిమానులు ఆమెని ట్రోల్ చేస్తున్నారు. రష్మిక ముద్దు సన్నివేశంలో నటించడం వారికి అంతగా నచ్చడం లేదు. గతంలో కూడా పలు కారణాలతో రష్మిక ట్రోలింగ్ కు గురైంది. ముఖ్యంగా హీరో రక్షిత్ అభిమానులు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. రక్షిత్, రష్మిక గతంలో ప్రేమించుకున్నారు. వీరిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. నిశ్చితార్థం తర్వాత వీరిద్దరూ విడిపోయారు.

    కన్నడ సినిమాలు

    కన్నడ సినిమాలు

    రష్మిక కన్నడల చిత్రాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా తెలుగు చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతోందనే కారణంతో కూడా ఆమె విమర్శలు ఎదుర్కొంది. ఈ రెండు విషయాల్లో రష్మిక స్వయంగా వివరణ ఇచ్చింది. తాను రక్షిత్ ని పెళ్లి చేసుకోవడం లేదని, అది తన వ్యక్తిగత విషయం అని రష్మిక తెలిపింది. ఇక కన్నడ చిత్రాల్లో నటించడం లేదనే విమర్శకు.. తన సొంత ఇండస్ట్రీని వదులుకుని ఎందుకు వెళతాను. కన్నడతో పాటు అవకాశం వచ్చిన అన్ని భాషల్లో నటిస్తానని రష్మిక తెలిపింది.

     సౌత్‌లో జోరు

    సౌత్‌లో జోరు

    రష్మిక ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రం త్వరలో విడుదల కానుంది. నితిన్ సరసన భీష్మ చిత్రంలో నటించబోతోంది. తమిళంలోహీరో కార్తీ సరసన నటిస్తున్న చిత్రం ఇటీవల ప్రారంభం అయింది. తమిళంలో రష్మిక నటిస్తున్న తొలి చిత్రం ఇదే.

    English summary
    Rashmika Mandanna Trolled for Dear Comrade teaser
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X