For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రష్మికను భాగస్వామిని చేసుకోబోతున్న విజయ్ దేవరకొండ.. ఇకపై ఆమె..

|
Rashmika In Plans To Turn Into 'Lady Rowdy' || Filmibeat Telugu

విజయ్ దేవరకొండ.. ఈ పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ సంచలనం. 'పెళ్లి చూపులు' అనే సినిమాలో డీసెంట్‌గా కనిపించిన ఈ యంగ్ హీరో.. 'అర్జున్ రెడ్డి'లో మాత్రం ఎంతో వైలెంట్‌గా కనిపించాడు. టాలీవుడ్‌లో ఈ సినిమా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అప్పటి వరకు మన తెలుగు ఫిల్మ్ మేకర్స్ పెట్టుకున్న సరిహద్దులను ఈ సినిమా చెరిపివేసింది. దీంతో విజయ్ దేవరకొండ భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఎంతో ఫాలోయింగ్‌ను పెంచుకున్న ఈ కుర్ర హీరో.. త్వరలోనే రష్మికను భాగస్వామిని చేసుకోబోతున్నాడట.

రౌడీ బ్రాండ్ ఏర్పాటు

రౌడీ బ్రాండ్ ఏర్పాటు

‘అర్జున్ రెడ్డి'తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ.. వ్యాపార రంగంలోకీ అడుగు పెట్టాడు. తనను అభిమానులు ముద్దుగా పిలుచుకునే ‘రౌడీ' పేరిటే.. మెన్స్‌వేర్‌ స్టోర్స్‌ను స్టార్ట్ చేశాడు. ఇప్పటికే హైదరాబాద్ సహా చాలా చోట్ల విజయ్ తన స్టాల్స్‌ను ఏర్పాటు చేశాడు. మరికొన్నింటిని కూడా మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

సరికొత్తగా ప్రమోషన్

సరికొత్తగా ప్రమోషన్

తన బ్రాండ్ దుస్తులకు ప్రమోషన్ చేసే విషయంలోనూ విజయ్ దేవరకొండ వైవిధ్యం ప్రదర్శిస్తుంటాడు. ప్రెస్ మీట్లు, సినిమా ఫంక్షన్లు ఇలా.. బయట అతడు ఎక్కడికి వెళ్లాలన్నా రౌడీ బ్రాండ్ దుస్తులనే వేసుకుని వెళ్తుంటాడు. అంతేకాదు, ఈ ప్రమోషన్ కోసం అతడు గతంలో కొన్ని ప్రత్యేకమైన షోలు కూడా ఏర్పాటు చేశాడు.

అమేజాన్‌తో డీల్

అమేజాన్‌తో డీల్

తన వ్యాపారాన్ని మరింత విస్తృతం చేయాలనే లక్ష్యంతో ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమేజాన్‌తో విజయ్ దేవరకొండ ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన రౌడీ బ్రాండ్ దుస్తులను సదరు సంస్థలో అమ్మకాలు జరిపేటట్లు విజయ్ డీల్ చేసుకున్నాడు. ఇక, అప్పటి నుంచి రౌడీ బ్రాండ్ మెన్స్‌వేర్ ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి.

ఇప్పుడు రష్మికతో ‘లేడీ రౌడీ'

ఇప్పుడు రష్మికతో ‘లేడీ రౌడీ'

ఇప్పటి వరకు మెన్స్‌వేర్‌కే పరిమితమైన విజయ్.. త్వరలోనే లేడీస్‌వేర్‌ను సైతం ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అతడు తన రియల్ పార్ట్‌నర్ రష్మిక మందన్నాను వ్యాపార భాగస్వామిగా చేసుకోబోతున్నాడని సమాచారం. ఈ మేరకు వీళ్లిద్దరి మధ్య ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని ఫిలింనగర్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.

వీళ్లిదరూ చేస్తున్న చిత్రం

వీళ్లిదరూ చేస్తున్న చిత్రం

విజయ్ దేవరకొండ - రష్మిక తాజాగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాను భరత్ కమ్మ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఊహించని విధంగా పెరిగిపోయాయి. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

English summary
Tollywood Young Hero Vijay Deverakonda Started Mens Clothing Business Name With Rowdy Wear. Then He Thought Start Lady Wear also. His Co star Rashmika Mandanna Will Partner In This Business.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more