twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రష్మిక గురించి మళ్ళీ అలాంటి వార్తలు.. ఆధారాలు చూపించండి అంటూ ఫైర్!

    |

    కన్నడ బ్యూటీ రష్మిక మందన టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఛలో చిత్రంతో టాలీవుడ్ కు రష్మిక పరిచయం అయింది. ఆ చిత్రం విజయం సాధించడంతో గీత గోవిందం చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశాన్ని రష్మిక దక్కించుకుంది. గీత గోవిందం చిత్రంలో రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. గీత గోవిందం ఘనవిజయం సాధించడంతో రష్మికకు యువతలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇదిలా ఉండగా కన్నడ మీడియాలో తన గురించి వస్తు న్న వార్తలపై రష్మిక ఫైర్ అయింది.

     కిర్రాక్ పార్టీ చిత్రంతో

    కిర్రాక్ పార్టీ చిత్రంతో

    రష్మిక కన్నడలో నటించిన కిర్రాక్ పార్టీ అనే చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది.తెలుగులో అవకాశాలు పెరుగుతున్న సమయంలో రష్మిక కన్నడ చిత్రాలు కాస్త తగ్గించింది. అయినా కూడా వీలు చూసుకుని కొన్ని కన్నడ చిత్రాల్లో సైతం నటిస్తోంది. ప్రస్తుతం రష్మిక యజమాన, పొగరు అనే కన్నడ చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగు రష్మిక ప్రస్తుతం డియర్ కామ్రేడ్ చిత్రంలో విజయ్ సరసన మరోమారు నటిస్తోంది. నితిన్ భీష్మ చిత్రంలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది.

    అలాంటి వార్తలు

    అలాంటి వార్తలు

    రష్మిక కన్నడలో కూడా నటిస్తున్నపటికి అక్కడి మీడియా మాత్రం రష్మికకు వ్యతిరేకంగా వార్తలు రాస్తోంది. ఓ మీడియా సంస్థ రష్మిక కన్నడ చిత్ర పరిశ్రమని పట్టించుకోవడం లేదని కథనాన్ని ప్రచురించింది. గతంలో కూడా రష్మిక గురించి ఇలాంటి వార్తలు వచ్చాయి. దీనిపై రష్మిక బాగా సీరియస్ అయింది. సదరు సంస్థకు ఘాటుగా సమాధానం ఇస్తూ.. నా సొంత చిత్ర పరిశ్రమని నేను ఎందుకు పట్టించుకోను. నా గురించి ఇలా ఎవరు అన్నారు. ఏ ఆధారంతో ఈ వార్త రాసారు అంటూ రష్మిక ఘాటుగా ప్రశ్నించింది.

    <strong>ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అన్నావ్... ఏమైంది? విజయ్ దేవరకొండను నిలదీసిన హీరోయిన్!</strong>ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అన్నావ్... ఏమైంది? విజయ్ దేవరకొండను నిలదీసిన హీరోయిన్!

    తప్పుగా అనుకోకండి

    తప్పుగా అనుకోకండి

    నేను ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. నా గురించి ఈ వ్యాఖ్యలు ఎవరు చేశారో తెలుసుకోవాలని ఉంది. నేరుగా నాకే మెసేజ్ చేయండి అంటూ రష్మిక బదులిచ్చింది. ఇలాంటి వార్తలని నేను పట్టించుకోను. వార్తలు రాసే సమయంలో అందులో ఎంతవరకు వాస్తవం ఉందనే విషయం కూడా పట్టించుకోవాలి అని రష్మిక హితబోధ చేసింది.

    వ్యక్తిగత విషయాలు

    వ్యక్తిగత విషయాలు

    ఆ మధ్యన రష్మిక వ్యక్తిగత జీవితానికి సంబందించిన విషయాలు కూడా మీడియాలో దుమారం రేగాయి. కన్నడ హీరో రక్షిత్ శెట్టికి, రష్మికకు గతంలో నిచ్చితార్ధం జరిగింది. వీరిద్దరూ విడిపోయారు. ఈ వార్త మీడియాలో సంచలనంగా మారడంతో రష్మిక సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురైంది. ఆ సమయంలో కూడా రష్మిక సోషల్ మీడియాలో వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    English summary
    Rashmika responds on fake news regarding her movies
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X