»   » చీలిక స్పష్టం: రాజకీయంగా చిరుతోనే, పవన్‌కు నో!

చీలిక స్పష్టం: రాజకీయంగా చిరుతోనే, పవన్‌కు నో!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rashtra Chiranjeevi Yuvatha supports Chiranjeevi
హైదరాబాద్: రాజకీయ పరంగా తామెప్పుడూ చిరంజీవితోనే ఉంటామని రాష్ట్ర చిరంజీవి యువత, రామ్ చరణ్ యువత సభ్యులు ప్రకటించారు. గురువారం హైదరాబాద్ లోని ఎన్ఎఫ్‌సిసి జరిగిన సమావేశంలో అభిమానులంతా సమావేశమై తీర్మాణం చేసారు. ఈ సమావేశంలో భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

పవనప్ కళ్యాణ్ గురించి వారు మాట్లాడుతూ....ఒక నటుడిగా, చిరంజీవి కుటుంబానికి చెందిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్‌ను అభిమానిస్తాం. కానీ రాజకీయంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలను ఎట్టిపరిస్థితుల్లో సమర్థించబోమని, తాము ఇప్పుడు, ఎప్పుడూ చిరంజీవి వెన్నంటే ఉంటామని చిరంజీవి యువత సభ్యులు తెలిపారు.

కాగా...మరికొందరు అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్‌కు జై కొడుతున్నారు. ఇంతకాలం పవన్ కళ్యాణ్ పేరుతో అభిమాన సంఘాలు నడిపిన వారు, పవనిజం పేరుతో కార్యక్రమాలు నిర్వహించిన వారంతా పవన్ కళ్యాణ్ వైపు టర్న్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ సమాజం బాగు కోసమే రాజకీయాల్లోకి వచ్చారని, ఆయనలాంటి మంచి వ్యక్తులు ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. జన సేన పార్టీ కార్యక్రమాలను వీరు దగ్గరుండి ముందుకు నడిపిస్తున్నారు.

ఈ పరిణామాలతో....మెగా అభిమానుల మధ్య చీలిక ఏర్పడిందనే విషయం స్పష్టం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇంతకాలం అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మెగా అభిమానులంతా ఇలా రెండుగా చీలిన నేపథ్యంలో మున్ముందు ఎలాంటి పరిణామాలు ఏర్పడుతాయో అనే ఒక ఆందోళన కొందరు వ్యక్తం చేస్తున్నారు.

English summary
Rashtra Chiranjeevi Yuvatha members said, We politically supports Chiranjeevi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu