8 మంది హీరోయిన్లతో శృంగారం ‘రసికుడు’ (ఫోటోలు)
హైదరాబాద్: ఇటీవల తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో 'రసికుడు' పేరుతో చంద్రశేఖరా మూవీస్ పతాకంపై కె.వెంకటరెడ్డి అనువదిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూన్ 13న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ రెడ్డి చిత్ర విశేషాలు తెలియజేసారు.
తమిళంలో హిట్టయిన సినిమాను తెలుగులో 'రసికుడు' పేరుతో అనువదించాం. ఇప్పటి వరకు మా బేనర్‌పై వచ్చిన దాదాపు 30 సినిమాలు విజయం సాధించాయి. ఈ చిత్రంలో యన్.ఎస్.రాజా హీరోగా, 8 మంది హీరోయిన్స్‌తో పాటు ప్రముఖ నటి మంజుల మరియు ఆనంద్ రాజ్ కీలకమైన పాత్రలలో నటిచారని తెలిపారు.
స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన వివరాలు, ఫోటోలు...

కథ
ఓ అనాధను చేరదీసి తన కూతురుని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది ఓ తల్లి. కానీ అనాధ సైకోగా మారి వెరైటీగా హత్యలు చేస్తుంటాడు. సైకోగా మారిన అనాధ మంచివాడిగా మారాడా? పెంచి పోషించిన తల్లి తన కూతురును ఇచ్చి పెళ్లి చేసిందా లేదా? అనేది ఈ సినిమా కథం.

సస్పెన్స్,
శృంగారం సస్పెన్స్ తో సాగే శృంగార భరిత చిత్రమని నిర్మాత వెంకట్ రెడ్డి చెప్పుకొచకొచ్చారు.

అందరికీ నచ్చుతుంది
ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. అన్ని ఏరియాల్లో బిజినెస్ పూర్తి చేసుకుంది నిర్మాత వెంకట్ రెడ్డి తెలిపాడు.

విడుదల
ఈ నెల 13న ఈ సినిమాను 100 థియేటర్స్ పైగా రిలీజ్ చేయనున్నాం. ఇందులో నాలుగు పాటలు సంగీతం పరంగా, సిచ్చువేషన్ పరంగా, రొమాంటిక్‌గా ఉంటాయి అన్నారు.

నటీనటులు
ఈచిత్రంలో యన్.ఎస్.రాజా హీరోగా శ్రావ్య, దివ్య, సోనియా, రాణి, స్వప్న మరియు ప్రముఖ నటి మంజుల, ఆనంద్ రాజ్ తదితరులు నటించారు.

సాంకేతిక విభాగం
ఈ చిత్రానికి పాటలు: సాయి రమేష్, పాటలు: పొందూరి, సంగీతం: రమేష్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: యన్.ఎస్.రాజా, నిర్మాత: కె.వెంకట్ రెడ్డి.


Click it and Unblock the Notifications