రామ్ చరణ్ ఇంట్లో పాము కలకలం (ఫోటోలు)
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో భారీ పాము దూరింది. ఇంట్లో పాము దూరిందనే విషయం తెలియగానే మెగాస్టార్ ఇంట్లో వారంతా బెంబేలెత్తిపోయారు. వెంటనే వారు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు రెస్క్యూ చేసి ఆ పామును పట్టుకున్నారు.
రామ్ చరణ్ ఇంట్లో దూరిన ఈ పాము రాట్ స్నేక్. బలిష్టంగా ఉండటంతో పాటు పొడవు దాదాపుగా రెండు మీటర్లు ఉంది. ఈ విషయాన్ని రామ్ చరణ్ తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను స్లైడ్ షోలో చూడొచ్చు.
పాము దూరడంతో ఇంట్లో కలకలం రేగడంతో పాటు, అందరూ కాస్త భయ పడ్డారు. అయితే వెంటనే దాన్ని సురక్షితంగా పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

రామ్ చరణ్ ఇంట్లో పాము
రామ్ చరణ్ ఇంట్లో దూరిన పాము ఇదే. దాదాపు రెండు మీటర్ల పొడవు ఉంది ఈ పాము.

ప్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ
ఇంట్లో పాము దూరిన విషయం ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి తెలియజేయడంతో సొసైటీ సభ్యులు వచ్చి ఆ పామును పట్టుకుని సురక్షితంగా అక్కడి నుండి తీసుకెళ్లారు.

గోవిందుడు అందరి వాడేలే
ప్రస్తుతం రామ్ చరణ్ కృష్ణ వంశీ దర్శకత్వంలో ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. కాజల్ హీరోయిన్.

దసరాకి విడుదల
మోగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో ఇప్పటి వరకు అరడజను సినిమాల్లో నటించారు. అయితే అందులో ఏ సినిమా కూడా దసరా సీజన్లో విడుదల కాలేదు. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే' చిత్రం మాత్రం తొలిసారిగా దాసరా సీజన్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











