'ఖిలాడి' విషయంలో మరో షాక్.. కేసు నమోదు, రిలీజ్ ఆపాలంటూ డిమాండ్?
రవితేజ హీరోగా నటించిన ఖిలాడి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది అనే చెప్పాలి. ఇప్పటికే కలెక్షన్స్ విషయంలో బాధ పడుతున్న నిర్మాతకి మరో తలనొప్పి వచ్చి చేరింది. ఈ సినిమా టైటిల్ తమదంటూ ఒక నిర్మాత కోర్టుకు వెళ్లారు. సినిమా విడుదల జరిగిపోయింది కాబట్టి ఓటీటీలో విడుదల కాకుండా చూడాలి అని కోరారు. ఆ వివరాల్లోకి వెళితే

మరో షాక్
మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఖిలాడి' సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిందనే చెప్పాలి. ఒకరకంగా కలెక్షన్స్ సరిగా రావడం లేదని బాధ పడుతున్న నిర్మాతకు మరో షాక్ తగిలింది. ఈ సినిమా మీద కేసు నమోదైంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రతన్ జైన్ ఈ సినిమా దర్శకనిర్మాతలపై కేసు పెట్టారు.

కోర్టులో కేసు
'ఖిలాడి' అనే టైటిల్ తన సొంతం అని, 1992లో అక్షయ్ కుమార్ హీరోగా ఈ టైటిల్ తో సినిమా కూడా రిలీజ్ చేసినట్లు రతన్ జైన్ వెల్లడించారు. అలాంటిది ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా తన సినిమా టైటిల్ వాడుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అసలు సినిమా విడుదల అవుతున్న విషయమే తనకు తెలియదని, ఎలాగో విడుదల జరిగింది కాబట్టి ఇష్యూ సెటిల్ అయ్యేవరకు సినిమా ఓటీటీ రిలీజ్ ను ఆపాలంటూ నిర్మాత రతన్ జైన్ కోర్టులో కోరారు.

అదే టైటిల్ తో
ఇక ఈ విషయం మీద ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడిన రతన్ జైన్.. రవితేజ 'ఖిలాడి' సినిమా టైటిల్ మార్చాలని.. ఎందుకంటే ట్రేడ్ మార్క్ యాక్ట్ కింద తను ఆల్రెడీ టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో తను డబ్బు ఏమీ ఆశించడం లేదని.. తన 'ఖిలాడి' సినిమా ప్రతిష్ట గురించే ఆలోచిస్తున్నానని చెప్పారు. సౌత్ లో లోకల్ అసోసియేషన్స్ లో టైటిల్స్ రిజిస్టర్ చేయించి అదే టైటిల్ తో వారి సినిమాలను హిందీలో రిలీజ్ చేస్తున్నారని రతన్ జైన్ అన్నారు.

అందుకే ఇలా
CBFC(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్) హిందీ సినిమా తరహా టైటిల్స్ తో ఉన్న డబ్బింగ్ సినిమాలను దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి పర్మిషన్ ఇవ్వడం వలన ఇలా జరుగుతుందని పేర్కొన్న ఆయన ఇది వరకు అయితే ఇలాంటి పరిస్థితి ఇలా ఉండేది కాదని పేర్కొన్నారు. సౌత్ ఇండస్ట్రీలో 'ఖిలాడి' అనే టైటిల్ తో సినిమా తెరకెక్కుతుందనే విషయం కూడా తనకు తెలియదని ఇప్పుడు సినిమా విడుదలైన తరువాత తాను ట్రైలర్ చూశానని ఆ తరువాత తనకు ఈ విషయం తెలిసిందని అన్నారు. వెంటనే కోర్టుని సంప్రదించినట్లు చెప్పారు.

ఓటీటీ రిలీజ్ అయినా
మెజిస్ట్రేట్ సినిమా రిలీజ్ ఆపడం కష్టమన్నారు కాబట్టి ఓటీటీ రిలీజ్ అయినా ఆపాలని కోరుతున్నట్లు రతన్ జైన్ తెలిపారు. ఈ సినిమా హిందీ మార్కెట్ లో రిలీజ్ అవుతున్న విషయం కూడా తనకు తెలియదని అన్నారు. ఇక ఈ సినిమాను హిందీలో పెన్ సినిమాస్ సంస్థ విడుదల చేసింది. జయంతి లాల్ గడ ఈ సినిమాను హిందీలో విడుదల చేశారు. మరి ఈ విషయంలో ఎవరు ఎలా? స్పందించనున్నారు అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











