Ratan Tata:రతన్ టాటా నిర్మించిన ఏకైక సినిమా ఘోర పరాజయం.. ఇంతకీ ఆ మూవీ ఏది? ?

Ratan Tata: భారతీయ వ్యాపార దిగ్గజం, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న రతన్ టాటా రెండు రోజుల క్రితం అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. రక్తపోటు సమస్య కారణంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి చిక్సిత పొందుతూ నిన్న (అక్టోబర్ 9) రాత్రి రతన్ టాటా ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఈ వార్త యావత్ దేశాన్ని విషాదంలో ముంచేసింది. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన రతన్ టాటాకు సినిమా ఇండస్ట్రీతో సంబంధముందనే విషయం చాలా మందికి తెలియదు. ఇంతకీ ఆ మూవీ ఏంటీ? మీరు కూడా ఓ లూక్కేయండి.

ఉన్నత విలువతో వ్యాపారాలు చేస్తూ మహోన్నత వ్యక్తిగా పేరుగాంచారు. రతన్ టాటా పేదల బంధువు. వ్యాపారవేత్తగానే కాకుండా సామాజిక సేవలో కూడా గుర్తింపు పొందారు. వందల కోట్ల వ్యాపార సామాజ్యానికి ఆయన అధినేత అయినా.. ఆయన సాధారణ జీవన విధానం ఎందరికో ఆదర్శప్రాయం. రతన్ టాటా చేయని వ్యాపారం లేదు. ఎయిర్‌క్రాఫ్ట్ పరిశ్రమ, ఆటోమోటివ్, పవర్, స్టీల్, హోటళ్లు, ఐటీ, రియల్ ఎస్టేట్ సహా అన్ని రంగాల్లో ఆయన విజయం సాధించారు.

Ratan Tata Entered Bollywood he produce Amitabh Bachchan- Vikram Bhatt Aetbaar movie

ఈ క్రమంలో రతన్ టాటా సినిమా రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.కానీ, రతన్ టాటా అన్ని రంగాల్లో సక్సెస్ అయినట్టు సినిమా రంగంలో మాత్రం వియం సాధించలేరు. రతన్ టాటా ఒక్క సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. కానీ, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది. అప్పటి నుంచి మరోసారి ఇండస్ట్రీ వైపు చూపలేదు. రతన్ టాటా ఎన్నో రంగాల్లో అడుగుపెట్టినట్టు సినిమా రంగంలో కూడా అడుగుపెట్టారు. సినిమాలకు ప్రోడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు.

రతన్ టాటా ప్రొడ్యూస్ చేసిన ఏకైక మూవీ'ఏత్‌బార్'. బాలీవుడ్ నిర్మాత జితిన్ కుమార్‌తో కలిసి రతన్ టాటా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహం, బిపాసా బసు ప్రధాన పాత్రల్లో నటించారు. 1996లో తెరకెక్కిన హాలీవుడ్ సినిమా 'ఫియర్' స్ఫూర్తితో విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2004లో విడుదలైంది.

Ratan Tata Entered Bollywood he produce Amitabh Bachchan- Vikram Bhatt Aetbaar movie

రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొల్తాపడింది. రూ.10 కోట్లతో నిర్మించిన ఈ మూవీ డిజాస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు ఖర్చు చేసిన దానిలో సగం కూడా సంపాదించలేకపోయింది. అలా రతన్ టాటా ప్రొడ్యూస్ చేసిన సినిమా అట్టర్ ప్లాప్ అయింది. ఇలా అమితాబ్ బచ్చన్ నటించిన ఏత్ బార్ ప్లాప్ గా మారడంతో రతన్ టాటా మరో సినిమా చేయలేదు. ఈ సినిమా తెచ్చిపెట్టిన నష్టాలతో మళ్లీ ఇండస్ట్రీలో అడుగుపెట్టకూడదని నిర్ణయించుకున్నాడట. ఆ సినిమా హిట్ అయి ఉంటే.. ఇండస్ట్రీ స్వరూపమే మారిపోయేదని మార్కెట్ వర్గాల అభిప్రాయం.

More from Filmibeat

Read more about: ratan tata amitabh bachchan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X