twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    న్యూ ఏజ్ యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘#బాయ్స్‌’

    |

    శ్రీ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం 'బాయ్స్' ఈరోజు అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. 'ర‌థం' ఫేమ్ గీతానంద్‌, శ్రీహాన్‌, రోనిత్ రెడ్డి, సుజిత్‌, అన్షులా, జెన్నీ ఫ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సంజ‌య్ స్వ‌రూప్‌, మేల్కొటి, ఉత్తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టిస్తున్నారు. ద‌యానంద్ ద‌ర్శ‌కుడు. నేహాశ‌ర్మ నిర్మాత‌. ఈ సినిమా ముహూర్త‌పు సన్నివేశానికి కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్ క్లాప్ కొట్టి, డైరెక్ట‌ర్‌కి స్క్రిప్ట్‌ను అందించారు. 'ర‌థం' నిర్మాత రాజా కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

    అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత సుప్రియ‌, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీ నిర్మాత రాహుల్ యాద‌వ్ న‌క్కా పూజా కార్యక్ర‌మాల్లో పాల్గొని యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా... ద‌ర్శ‌కుడు ద‌యానంద్ మాట్లాడుతూ - 'ద‌ర్శ‌కుడిగా నా తొలిచిత్రం. న్యూ ఏజ్ యూత్‌ఫుల్ ల‌వ్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌. మంచి టీమ్ కుదిరింది. క‌థ న‌చ్చగానే నిర్మాత‌లు వెంట‌నే సినిమాను చేయ‌డానికి అంగీక‌రించారు. వారికి నా థ్యాంక్స్‌' అన్నారు.

    నిర్మాత నేహాశ‌ర్మ మాట్లాడుతూ 'న్యూ ఏజ్ యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మా బాయ్స్ సినిమా బాయ్స్ సినిమాను రూపొందిస్తున్నాం. సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేస్తాం. టాకీ పార్ట్ అంతా హైద‌రాబాద్‌లో ఉంటుంది. గోవాలో పాటల‌ను చిత్రీక‌రిస్తాం. సెప్టెంబ‌ర్ 4 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం' అని అన్నారు.

    Ratham Fame Geethanandan new movie Boys Starts

    న‌టీన‌టులు:
    గీతానంద్‌, శ్రీహాన్‌, రోనిత్ రెడ్డి, సుజిత్‌, అన్షులా, జెన్నీ ఫ‌ర్, సంజ‌య్ స్వ‌రూప్‌, మేల్కొటి, ఉత్తేజ్ త‌దిత‌రులు

    సాంకేతిక వ‌ర్గం:
    సినిమాటోగ్ర‌ఫీ: వెంక‌ట్ ప్ర‌సాద్‌, ఎడిట‌ర్‌: మార్తాండ్ కె.వెంక‌టేశ్‌, మ్యూజిక్‌: స్మ‌ర‌ణ్‌(RX 10 బ్యాగ్రౌండ్ స్కోరర్‌), కొరియోగ్ర‌ఫీ: శివ‌శంక‌ర్ మాస్ట‌ర్‌, జావెద్‌, డిజైన‌ర్‌: పి.శ్యామ్‌, పి.ఆర్‌.ఒ: తేజ‌స్వి స‌జ్జ‌, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: బెక్కం ర‌వీంద‌ర్‌, కో ప్రొడ్యూస‌ర్‌: బాల‌చంద్ర‌, ప్రొడ్యూస‌ర్‌: నేహాశ‌ర్మ‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ద‌యానంద్‌.

    English summary
    Ratham Fame Geethanandan new movie Was Boys. This Movie Produced By Neha Shrma. And Directed By Dayanand under Sri picture's Prduction.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X