twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రతినిర్వేదం' స్టోరీ లైన్, రిలీజ్ డేట్

    By Srikanya
    |

    తనకన్నా ఐదేళ్ళు చిన్నవాడైన యువకుడు తనను కాంక్షిస్తున్నాడని తెలిసిన ఓ యువతి మనో భావోద్వేగ చిత్రణే 'రతినిర్వేదం'.'తనకు తెలియకుండానే తనకన్నా పెద్దదయిన అమ్మాయి ఆకర్షణకులోనైన అబ్బాయి, తనకన్నా చిన్నవాడి ఆకర్షణ నుంచి తప్పించుకోలేక సతమతమయ్యే అమ్మాయి...ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనేది అంశాన్ని బేస్ చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. అబ్బాయి పాత్రలో శ్రీజిత్ నటించగా, అమ్మాయి పాత్రను శ్వేతామీనన్ పోషించారు. ఈ చిత్రానికి రాజీవ్ కుమార్ దర్శకత్వం వహించారు. మళయాళంలో విజయవంతమైన 'రతినిర్వేదం'చిత్రం తెలుగులో అదే టైటిల్ తో డబ్బింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్నిఈ నెల 16న విడుదల చేస్తున్నారు.

    శ్వేతమీనన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఎస్.వి.ఆర్.మీడియా ప్రై. లిమిటెడ్ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ చిత్రం గురించి నిర్మాత శోభ మాట్లాడుతూ "16న 250 థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్నుత్నాం. వెర్సటైల్ చిత్రం. శ్వేతమీనన్ పాత్ర పేరు రతి.ఆమె తన భావోద్వేగాలను ముఖకవళికల్లో వ్యక్తం చేసిన తీరు ప్రశంసనీయం. వైవిధ్యమైన చిత్రాలు చూడాలరనుకునేవారికి కనులపండువగా ఉంటుంది. సినిమా మొత్తం రెండిళ్ళ మధ్య జరుగుతుంది. ఏ బంధం ఎవరి మధ్య ఎందుకు కలుగుతుందో చెప్పలేం. ఈ సినిమా ఆద్యంతం అదే సూత్రంపై నడుస్తుంది. సున్నితమైన అంశాన్ని దర్శకుడు తెరకెక్కించిన విధానం అద్భుతం.పాటలు, కెమెరా పనితనం, పచ్చటి లొకేషన్లు, శ్వేతమీనన్ నటన... చాలా హైలైట్‌లున్నాయి.

    ప్రముఖ రచయిత కీ.శే. పి. పద్మరాజన్ రాసిన ఒక వినూత్న ప్రేమకథా చిత్రం 'రతినిర్వేదం'. 1978లో జయభారతి నటించగా 'రతినిర్వేదం' పేరుతోనే రూపొంది ఘనవిజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఇప్పుడు అదే పేరుతోనే మలయాళంలోనే పునర్నిర్మితమై పెద్ద హిట్టయింది. ప్రతి సన్నివేశంలోనూ దర్శకులు టి.కె.రాజీవ్‌కుమార్ ప్రతిభ కనిపిస్తుంది. మంచి స్క్రీన్‌ప్లేను సమకూర్చారు'' అని అన్నారు. శ్రీజిత్, శ్వేతామీనన్ జంటగా నటించారు. సమర్పణ: ఎస్.వి.ఆర్.మీడియా ప్రై. లిమిటెడ్, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: టి.కె.రాజీవ్‌కుమార్.

    English summary
    Malayalam movie 'Rathinirvedam' dub in Telugu. S.V.R Media producing this movie in Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X