'రోబో' కెమెరామెన్ తో మహేష్ బాబు
రజనీకాంత్ రోబో చిత్రానికి కెమెరా అందించిన రత్నవేలుని తన తాజా చిత్రానికి మహేష్ ఎంచుకున్నారు. వివరాల్లోకి వెళితే..సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌బాబు నటించే చిత్రం త్వరలోనే పట్టాలు ఎక్కనుంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. రత్నవేలు ఛాయాగ్రహణం అందిచనున్నారు.హీరోయిన్ ఎవరనేది ఎంపిక జరుగుతోంది. క్యారెంటర్ ఓరియెంటేషన్ తో సాగ్ మైండ్ గేమ్ సినిమా అని వినపడుతోంది. ఇక రత్నవేలు గతంలో సుకుమార్ తో ఆర్య,జగడం చిత్రాలుకు పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేస్తున్న దూకుడు అనంతరం మహేష్ వెంటనే ఈ షూటింగ్ లో పాల్గొంటారు.


Click it and Unblock the Notifications











