Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
మరోసారి సైరా చూశా.. సింహంలా గర్జిస్తున్నాడు.. చిరు నటనపై సెన్సేషనల్ కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం సైరా. అక్టోబర్ రెండో తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. తెలుగు సీనీ చరిత్రలో నిలిచిపోయేలా సైరాను తెరకెక్కించిన రామ్ చరణ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. సైరాలో చిరు నటనను సినీ లోకం పొగడ్తలతో ముంచెత్తుతోంది. తన సినీ జీవితంలో మైలురాయిగా నిలిచిపోయే సినిమా అంటూ అందరూ కీర్తిస్తున్నారు.
అయితే కేవలం నటీనటులకే కాకుండా సినిమాకు పనిచేసిన ప్రతిఒక్కరికీ అభినందనలు వస్తున్నాయి. అన్ని విభాగాలు సమష్టిగా కలిసి పని చేయడంతోనే ఈ మూవీ ఇంతటి విజయాన్ని సాధించిందని అందరూ అంటున్నారు. ఆర్ట్ విభాగం, క్యాస్టూమ్ విభాగం, కెమెరామెన్, సంగీతం, నేపథ్య సంగీతం ఇలా అన్నీ కలిసి సైరాను ఈ స్థాయిలో నిలబెట్టాయి.
రత్నవేలుపై ప్రశంసలు..
సైరాకు కెమెరామెన్ గా పనిచేసిన రత్నవేలుకు అన్ని వైపులా నుంచి అభినందనలు వెల్లు వెత్తుతున్నాయి. రత్నవేలు కెమెరా పనితనం అందరికీ తెలిసినా.. సైరాతో మరోసారి తన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశాడు. సినిమాను అద్భుతంగా మలిచి.. ప్రేక్షకులకు అందించాడు. విజువల్ వండర్ గా సైరాను తెరకెక్కించడంతో రత్నవేలు పోషించిన పాత్రను అందరూ ప్రశంసిస్తున్నారు.
సింహాంలా గర్జించారు..
సైరాను మరోసారి వీక్షించిన రత్నవేలు.. సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యారు.‘సైరాను మరోసారి చూశాను. చిరంజీవి తన సినీ జీవితంలోనే బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. బ్రిటీష్ వారిపై గర్జించే సింహాంలా దూకాడు.. క్లైమాక్స్‌లో చిరు నటన అద్భుతం.. హ్యాట్సాఫ్ చిరు సర్.. మీరు చూపించిన ప్రతీ ఎమోషన్‌ను చూపించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది, అది నా అద`ష్టంగా భావిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశాడు.
పీసీ శ్రీరామ్ స్పందన..
భారతదేశం గర్వించదగ్గ సినిమాటోగ్రఫర్ పీసీ శ్రీరామ్.. సైరా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘సినిమాకు సంబంధించి ప్రతీ అంశాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. కంగ్రాట్స్ ర్యాండీ.. దేశవ్యాప్తంగా సైరా దూసుకుపోతోంది. చిరంజీవి బ్యాక్ విత్ బ్యాంగ్'అంటూ ట్వీట్ చేశారు. దీనికి రిప్లై ఇస్తూ.. థ్యాంక్యూ.. పీసీ శ్రీరామ్ సర్.. మీరు పొగిడారంటే అదే చాలు.. అని అన్నాడు.
కలెక్షన్లలో సైరా.. ఔరా! అనిపిస్తోంది...
సైరాకు అద్భుతమైన టాక్ రావడంతో వసూళ్లలో తిరుగులేకుండా పోతోంది. తొలిరోజే 85 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి ఔరా అనిపించింది. మూడో రోజుల్లో దాదాపు 140 కోట్ల గ్రాస్‌ను రాబట్టి వంద కోట్ల షేర్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. లాంగ్ వీకెండ్, దసరా సెలవులు ఇలా అన్నింటిని సైరా బాగానే వాడుకుంటోంది. ఇక ఇదే విధంగా సైరా సత్తా చాటితే.. వసూళ్లలో కొత్త రికార్డులు క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.