‘1’ నేనొక్కడినే: మోటార్‌బైక్ హెడ్‌లైట్ వెలుగులో చేశాం
హైదరాబాద్ : '1' నేనొక్కడినే చిత్రంలో ప్రీ క్లైమాక్స్ షూటింగ్‌లో ఓ స్టోరేజ్ బాంక్‌లో షూటింగ్ చేయాల్సి వచ్చింది. హీరో, హీరోయిన్లు కలిసి గోల్డెన్ రైస్ బ్రీఫ్‌కేస్‌ను తీసుకెళ్ళ సన్నివేశంలో ఎలాంటి లైటింగ్ లేకుండా షూటింగ్ చేయడం ఓ సవాల్ లాంటిది. మోటార్‌బైక్ హెడ్‌లైట్ వెలుగులో ఆ షూటింగ్ చేశాం. ఇప్పుడు ఆ సీన్‌కు మంచి స్పందన లభిస్తోంది. అందుకు చాలా సంతోషంగా ఉందని కెమెరామెన్ రత్నవేలు తెలిపారు.
14 రీల్స్ పతాకంపై మహేష్‌బాబు, కృతిసనన్ జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన '1' చిత్రానికి కెమెరామెన్‌గా రత్నవేలు పనిచేశారు. హాలీవుడ్ స్థాయి చిత్రీకరణతో '1' చిత్రాన్ని నిర్మించాము కనుక ముందు జాగ్రత్తలు అనేకం తీసుకున్నామని, ఇది చాలా టఫ్‌తో కూడిన జాబ్ అని ఆయన అన్నారు. దర్శకుడి ఆలోచనలకు తగినవిధంగా ఈ చిత్రంలో తాను నడుచుకొన్నానని, అతనిని అనుసరించి చేసినందువల్లే ఇప్పుడు మంచి ఔట్‌పుట్ ఇవ్వగలిగానని, ప్రతి సన్నివేశం గూర్చి ముందుగానే చర్చించి నిర్ణయం తీసుకునేవారమని ఆయన అన్నారు.
'1' చిత్రం పరిస్థితి వేరు. ఇందులో భావోద్వేగాలను ముఖ్యంగా హీరో చిన్ననాటి జ్ఞాపకాలతో ఉన్న విషయాలను తెరపై ఆవిష్కరించడం ఓ సవాల్ లాంటిదేనని ఆయన అన్నారు. హీరో తన చిన్ననాటి జ్ఞాపకాలతో తన ఇంటిని వెతుక్కుంటూ వెళ్లే సీన్ చివరిలో అందరికీ నచ్చిందని, సుకుమార్ దర్శకుడిగా సరికొత్త ఆలోచనలతో నిరంతరం సినిమా మంచి ఔట్‌పుట్ రావడం కోసం కృషి చేస్తారని, తాను కెమెరా యాంగిల్ ఇలా పెట్టాలి అని అంటే, ఇలా కాదు అలా ఎందుకు పెట్టకూడదని ఆయన సరికొత్తగా ప్రయత్నించడమే సినిమా సగం విజయం సాధించడానికి కారణమని ఆయన తెలిపారు.
'రోబో' చిత్రం అప్పట్లో చేయడం ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అని, ఆ జానర్‌కు ఈ జానర్‌కు చాలా తేడా ఉందని, రోబో చిత్రానికి 18 నెలలు షూటింగ్ అనుకుంటే 24 నెలలు పట్టిందని ఆయన అన్నారు. ఈ చిత్రానికి పనిచేశాక మహేష్‌బాబు అభినందన చాలా సంతోషాన్నిచ్చిందని, వచ్చే సంవత్సరం స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించే సన్నాహాలు చేస్తున్నానని, ప్రస్తుతం ఏ చిత్రం తాను ఒప్పుకోలేదని ఆయన వివరించారు.


Click it and Unblock the Notifications












