twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కామవాంఛ వదిలి మహాకవి ఎలా అయ్యాడనేదే..

    By Bojja Kumar
    |

    ఎం.వి.ఎస్ క్రియేషన్స్ పతాకంపై అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో మచ్చా శ్రీనివాసరావు నిర్మిస్తున్న చారిత్రాత్మక చిత్రం 'రత్నావళి'. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి మూడవ వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర విశేషాలను నిర్మాత మీడియాకు వెల్లడించారు.

    కథ గురించి వివరిస్తూ...'రత్నావళి' నిండు యవ్వనంలో ఉన్న కొత్త పెళ్లి కూతురు. భర్త తులసీదాస్ మహా కవి కావలసినవాడు. తొలి రాత్రి నుండే భార్యే సర్వస్వంగా శారీరక వాంఛతో రగిలిపోతున్నాడు. క్షణిక సుఖమే శాశ్వత పరమానందంగా భ్రమించాడు. కళ్లు తెరిస్తే స్త్రీ దేహం, కళ్లు మూస్తే ఆనందపు స్త్రీ సుఖం. భర్త పూర్తిగా తనకు దాసుడు కావడం ఎంతో సంతోషాన్ని కలిగించినా క్రమక్రమంగా తన భాద్యత రత్నావలి తెలుసుకుంటుంది. అర్థరాత్రి ప్రళయ భీభత్సమైన వర్షంలో పొంగి పొర్లుతున్న నదిని దాటుకుని, తన పొందుకోరి వచ్చిన భర్తను తిరస్కరించింది. ఆ పరిణామ క్రమంలో రత్నావళి-తులసీ దాస్ దాంపత్య బంధం ఎలా మారి పోయింది? అతను 'హనుమాన్ చాలీసా', 'రామ చరిత మానసం' రచించిన మహా కవి 'తులసీదాసు'గా ఎలా ప్రసిద్ధి కెక్కాడు? రామ భక్త హనుమాన్ చూపిన మహిమలేమిటి? కాశీ విశ్వేశ్వరుడు ఏ అద్భుత సన్నివేశంలో తులసీదాసుని మహా కవిగా ప్రకటించాడు అనే కథాంశంతో సినిమా సాగుతుందని తెలిపారు.

    తులసీదాస్ గా సునీల్ శర్మ, రత్నావళిగా పూజా బలూటియా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కాశీరాజుగా సుమన్, మీరాభాయిగా వాణీ విశ్వనాథ్, హనుమంతుడిగా విందూ సింగ్, సూరదాసుగా ఏవీఎస్, వాల్మీకిగా విజయచందర్, ఇతర పాత్రల్లో కె. రాజశేఖర్, వినయ్ వర్మ, ప్రియ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు, ప్రాజెక్టు డిజైనర్ : కె. వీరేంద్ర, సంగీతం : శశిప్రీతమ్, ఫోగో గ్రఫీ : మధుమహంకాళి, ఎడిటింగ్ : కె. రవీంద్రబాబు, కొరియోగ్రఫీ : రమణ, సమర్పణ : మఫత్ ఫ్యాబ్రిక్స్, నిర్మాత : మచ్చా శ్రీనివాసరావు, రచన, దర్శకత్వం : అల్లాణి శ్రీధర్.

    English summary
    Ratnavali movie will release on Feb. This movie directed by Allani sridhar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X