100% లవ్ డైరెక్టర్ సుకుమార్ తో మహేష్ ‘జగడం’...!
'దూకుడు" వంటి సూపర్ హిట్ మూవీ నిర్మించిన 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బేనర్ లోనే సుకుమార్ డైరెక్షన్ లో మహేష్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ౧౦౦% లవ్ సినిమా సక్సెస్ తో జోరు మీదున్న సుకుమార్ డైరక్షన్ లో చేయడానికి మహేష్ ఓ.కె చెప్పేసాడట. దూకుడు సినిమాను నిర్మిస్తున్న 14రీల్స్ ఎంటర్ టెయిన్ మెంట్ నిర్మాతలు రామ్, గోపి,అనిల్ నిర్మాణంలోనే ఈ సినిమా కూడా తెరకెక్కబోతుంది. ఈ సినిమాకి కెమెరామెన్ ఎవరనే విషయంలో సుకుమార్ పట్టుబట్టాడట. తన మొదటి చిత్రం 'ఆర్య", రెండో చిత్రం 'గజడం" కి వర్క్ చేసిన రత్నవేలు కావాలని అడిగాడట.
ఈ విషయంలో మహేష్ తో ఆర్గ్యూ చేసి మరీ ఒప్పించాడని సమాచారం. ఈ మధ్య రజనీకాంత్ తో 'రోబో" చేసిన రత్నవేలుకి సినిమాటోగ్రాఫర్ గా ఎంత మంచి పేరొచ్చిందో అందరికీ తెలిసిందే. తను ఎంతో ప్రెస్టీజియస్ గా భావిస్తున్న మహేష్ సినిమాకి రత్నవేలు ఫోటోగ్రఫీ అయితే బాగుంటుందని భావించిన సుకుమార్ రత్నవేలుని అప్రోచ్ అయి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాడట. రత్నవేలు కూడా ఈ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. ప్రస్తుతం మహేష్ పూరి దర్శకత్వంలో చేస్తున్న బిజినెస్ మ్యాన్ అనంతంర సుకుమార్ షూటింగ్ లో మహేష్ పాల్గొననున్నాడని సమాచారం.


Click it and Unblock the Notifications











