Raveena Tandon: రవీనా టాండన్‌పై దాడి.. ప్లీజ్ కొట్టొదంటూ బతిమాలుకున్న బ్యూటీ, వీడియో వైరల్
బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ పై తాజాగా దాడి జరిగనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది. అయితే అందులో రవీనా తనను కొట్టొదంటూ అక్కడి వాళ్లను బ్రతిమాలడం కూడా కనిపిస్తోంది. అయితే రవీనాతో పాటు ఆమె కారు డ్రైవర్ పై కూడా వాళ్లు దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ ఆఫ్ ది టాపిక్ గా మారిన ఈ పూర్తి విషయం ఏంటి, అసలు ప్రజలు రవీనాతో పాటు ఆమె కారు డ్రైవర్ ను ఎందుకు కొట్టారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రవీనా టాండన్ తన కారులో కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లింది. ఈక్రమంలోనే ముంబైలోని బాంద్రా వెస్ట్ కార్టర్ రోడ్డు వద్దకు వెళ్లగానే వీరి కారు ప్రమాదానికి గురైంది. ముఖ్యంగా వీరి కారు ముందు వెళ్తున్న మరో కారును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే ఎదురుగా ఉన్న కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలు కావడంతో.. కోపంతో వాళ్లు కారు దిగి రవీనా కారును ఆపేశారు. డ్రైవర్ ను కిందకు దింపి మరీ కొట్టినట్లు సమాచారం.

అయితే తమ డ్రైవర్ ను అందరూ కలిసి కొడుతుండడంతో.. హీరోయిన్ రవీనా టాండన్ కిందకు దిగి వారిని ఆపే ప్రయత్నం చేసింది. ఈక్రమంలోనే గొడవ మరింత పెద్దది అయింది. అయితే ఇందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అందులో రవీనా అక్కడి వాళ్లను నన్ను కొట్టకండి ప్లీజ్ అంటూ బతిమాలడం మనం వినొచ్చు. అలాగే వీడియోలు తీయొద్దని బతిమాలినట్లు కూడా వినిపిస్తోంది. అంతే కాకుండా మరో మహిళ రవీనా నాపై దాడి చేశారు.. నా ముక్కులోంచి రక్తం వస్తుందంటూ చెప్పడం కూడా చూడొచ్చు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఆమెను కొట్టాలంటూ గొడవ చేశారు.
ఇదంతా ఇలా ఉండగా.. స్థానికులు మాత్రం రవీనా టాండన్ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేశారని వారిదే తప్పని అంటున్నారు. అలాగే రవీనా తన తల్లిని కొట్టిందని.. దాని వల్ల ఆమెకు తీవ్ర గాయమై ముక్కులోంచి రక్తం కూడా కారినట్లు ఓ వ్యక్తి ఆరోపించారు. అయితే వాళ్లు మద్యం మత్తులోనే కారుతో ఢీకొట్టి, ఆపై దాడి చేశారని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా.. పోలీసులుకు కూడా విచారణ చేస్తున్నారు.
అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోయినప్పటికీ.. ఖార్ పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై రవీనా నుంచి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఈ ఘటనలో తప్పు ఎవరిది, ఒప్పు ఎవరిది, అసలు ఏం జరిగిందనేది తెలియాలంటే మరో రెండు, మూడు రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











