నువ్ చచ్చిపోయిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటాను.. ఆవేశంతో ఊగిపోయిన రవిబాబు
భిన్న చిత్రాలను తెరకెక్కించే రవిబాబు నిజ జీవితంలోనూ అంతే భిన్నంగా ఉంటాడు. ఆ మధ్య కరోనా వైరస్‌పై సెటైర్లు వేయడం, సెక్యూరిటీ గార్డ్‌ను చెక్ చేయడం.. కరోనా వెళ్లకపోతే తదుపరి భవిష్యత్ ఏంటని చెబుతూ టీ మాస్టర్‌గా మారుతానని ఇలా వెరైటీ వెరైటీ వీడియోలతో రవిబాబు లాక్డౌన్‌లో రచ్చ రచ్చ చేశాడు. తాజాగా రవిబాబు ఒకరిపై వీరాశేవంతో ఊగిపోయాడు. నువ్ చచ్చిన రోజు డెత్ యానివర్సరీని సెలెబ్రేట్ చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు.

టీ మాస్టర్ అవతారం..
కరోనా తగ్గుముఖం పట్టకపోవడంపై రవిబాబు ఆ మధ్య సెటైర్లు వేశాడు. షూటింగ్‌లు చేసుకునే దారి లేకపోవడంతో కొత్త కెరీర్‌ను చూసుకునేపనిలో పడ్డానని రవిబాబు చెప్పుకొచ్చాడు. ఈ మేరకు టీ మాష్టర్ అవతారమెత్తాడు. ప్రొఫెషనల్ టీ మాష్టర్స్ చేసినట్టుగా చాయ్‌ను అంత ఎత్తునుంచి వడబోసేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ అలా చేయడం రవిబాబు వల్ల కావడం లేదు. అలా వెరైటీ వీడియోలతో రవిబాబు అందర్నీ ఎంటర్టైన్ చేశాడు.
Recommended Video

డెత్ యానివర్సరీ..
మై డియర్ కరోనా.. ఇవ్వాలా నీ బర్త్ యానివర్సరీ అని సంబరపడిపోతున్నావ్ కదా.. కానీ నేను మాత్రం భగభగ మండిపోతున్నాను.. కానీ త్వరలోనే వ్యాక్సిన్ వస్తుంది..జనమంతా హ్యాపీ అవుతారు.. అంతా నార్మల్ అవుతుంది.. నువ్వూ చచ్చిపోతావ్.. అప్పుడు సెలెబ్రేట్ చేసుకుంటాను.. నీ డెత్ యానివర్సరీ అంటూ రవిబాబు కరోనాను భయపెట్టేశాడు.


Click it and Unblock the Notifications











