ఆ రోజు నుంచీ ఒంటరిగా పడుకోవడం లేదు. : రవిబాబు
రవిబాబు త్వరలో 'అవును' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ మరియు పివిపి సినిమా బేనర్ సరమర్పణలో ఈచిత్రం రూపొందుతోంది. పూర్ణ ప్రధాన పాత్ర పోషించింది. చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ సందర్భంగా రవిబాబు మీడియాతో మాట్లాడారు.
అలాగే ''నువ్విలా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు... అందులో హీరోయిన్ గా నటించిన యామీగౌతమ్ తన నిజ జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలను నాతో పంచుకొంది. అవన్నీ విని.. నాకే చాలా భయమేసింది. యామి చెప్పిన సంగతులనే స్ఫూర్తిగా తీసుకొని తీర్చిదిద్దిన చిత్రమిది'' అంటున్నారు 'అల్లరి' రవిబాబు. ''ఎలాంటి హడావుడి లేకుండా సినిమాలు తీయడమంటేనే నాకిష్టం. 'అవును' అలా రూపుదిద్దుకొన్నదే అని చెప్పారు.
ఇక పబ్లిసిటీ గురించి మాట్లాడుతూ ''ఒక సినిమాకి వంద పోస్టర్లు వేయడం నాకు ఇష్టం ఉండదు. నా సినిమా మొదలైనప్పటి నుంచీ.. ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకూ ఒకే ఒక పోస్టర్ సరిపోతుంది. ఈసారీ అదే పంథాలో వెళ్తున్నాం. ఓ అందమైన అమ్మాయిని ఏనుగు ఎత్తుకొంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్టుతో పోస్టరు రూపొందించాము'' అన్నారు. హర్షవర్థన్ రాణే, చలపతిరావు, భార్గవి తదితరులు నటించారు. సంగీతం: శేఖర్‌చంద్ర. ఛాయాగ్రహణం: ఎన్.సుధాకర్‌రెడ్డి, నిర్మాణం: సురేష్ ప్రొడక్షన్స్, పి.వి.పి.సినిమా.


Click it and Unblock the Notifications












