ఫ్లాఫ్ అని రవిబాబుతో ముఖం మీదే అన్నారా?

By Srikanya

హైదరాబాద్: ప్రతి సినిమా అన్ని వర్గాలకు నచ్చాలనే ఆలోచనలో ప్రస్తుతం సినీ జనాలున్నారు. అందరికీ నచ్చే సినిమా చేయాలంటే గతంలో వచ్చిన వాటినే మార్పులు చేసి తీయాలి. అప్పుడు అది కాపీ అవుతుంది. అలా కాకుండా వైవిధ్యంగా ఆలోచిస్తేనే కొత్తదనం కనిపిస్తుంది. నేను అలాగే ఆలోచించి ఈ 'లడ్డుబాబు' సినిమా చేశాను అన్నారు రవిబాబు. ఎందుకింతలా రవిబాబు సినీ జనాల పై ఆవేశపడ్డాడు అంటే ఆయనతో మీ చిత్రం బాగోలుద... ఫ్లాఫ్ అని ముఖం మీదే ఎవరన్నా అన్నారేమో అంటున్నారు కొందరు ఫిల్మ్ నగర్ వాసులు. రవిబాబు నుంచి వచ్చిన చిత్రం 'లడ్డుబాబు'. ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా రవిబాబు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

అలాగే రవిబాబు తను ఎందుకు కామెడీ సినిమాగా దీన్ని తీయలేదో చెప్తూ... హీరోని భారీకాయుడిగా చూపించి వినోదాత్మకమైన చిత్రం తీస్తారనుకున్నాం.. కానీ ఇలా భావోద్వేగభరిత సినిమా ఎందుకు తీశారు అని కొందరు అడుగుతున్నారు. నేను నరేష్‌తో సినిమా చేయాలి అనుకోగానే నాకు రెండు ఆలోచనలు వచ్చాయి. ఒకటి నరేష్‌తో సాధారణమైన వినోదాత్మకమైన సినిమా చేయకూడదని. రెండు ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులు, పిల్లలకు చేరాలని. అందుకే ఇలాంటి సినిమా చేశా అన్నారు. నా గత సినిమాలు చూసి ఈ సినిమాని అంచనా వెయ్యొద్దు. తాజా ఆలోచనలతో రండి.. సినిమా చూసి ఆనందించండి అని చెప్పారు.

Ravi Babu about his latest 'Laddu Babu'

ఇక 'అల్లరి'తో ప్రేక్షకులకు పరిచయమైన నరేష్‌ని 'లడ్డుబాబు'గా మార్చాను. ప్రచార చిత్రాలు చూసి కొందరు నరేష్‌ ఏంటి ఇలా ఉన్నాడు అనుకున్నారు. ఇప్పుడు మాత్రం ఎందుకు అలా చేశామో అర్థం చేసుకుంటున్నారు. ఇది ఓ బరువైన కథ. తండ్రీ- కొడుకు, తల్లి-బిడ్డ, స్నేహబంధం... ఇలా అనేక అంశాల్ని సినిమాలో చూపించాం. దానికి వినోదం కూడా జోడించాం. దీన్ని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. 'లడ్డుబాబు' కథను నరేష్‌ కోసం రాసుకోలేదు. 'లావు మనిషి' అంటూ చాలా కాలం క్రితమే రాసుకున్నాను. దీనికి నరేష్‌ అయితే బాగుంటాడు అని ఆయన్ని పెట్టుకున్నాం అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X