మళ్లీ ‘అల్లరి’ నరేష్-రవిబాబు కాంబినేషన్
త్వరలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ప్రారంభం కాబోతోంది. మే నెల చివరలో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అల్లరి నరేష్‌ను రొటీన్‌కి భిన్నంగా రవిబాబు ఈచిత్రంలో చూపించబోతున్నారట. త్వరలో వీరి సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
ప్రస్తుతం అల్లరి నరేష్ 'కెవ్వు కేక' చిత్రంలో చేస్తున్నాడు. ఈ చిత్రానికి దేవిప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. షర్మిల మాంద్రే కథానాయిక. జాహ్నవి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కెవ్వుకేక సినిమాలో నరేష్, షర్మిల మాంద్రే, ధర్మ వరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, అలీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈచిత్రానికి కథ: దేవిప్రసాద్, వేగేశ్న సతీష్, మాటలు: వేగేశ్న సతీష్, కెమెరా: అడుసుమిల్లి విజయ్ కుమార్, సంగీతం: చిన్ని చరణ్, భీమ్స్, ఎడిటర్: నందమూరి హరి, నిర్మాణ నిర్వహణ: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు, సమర్పణ: శ్రీమతి నీలిమ, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: దేవి ప్రసాద్.


Click it and Unblock the Notifications












