twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హీరోయిన్ జీవితంపై రవిబాబు ‘అవును’(ఫస్ట్ లుక్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న రవిబాబు త్వరలో 'అవును' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ మరియు పివిపి సినిమా బేనర్‌ సరమర్పణలో ఈచిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజైంది.

    Avunu

    మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...హీరోయిన్ యామి గౌతమి జీవితంలో జరిగిన ఓ రియల్ సంఘటన ఆధారంగా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో యామి గౌతమి రవిబాబు దర్శకత్వంలో 'నువ్విలా' చిత్రంలో నటించింది. ఈచిత్రం షూటింగ్ సమయంలో రాజమోజీ ఫిల్మ్ సిటీలో ఇద్దరూ ఒకే హోటల్‌లో స్టే చేసారు. అప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటన రవిబాబుకు వివరించగా దాన్నే ఆయన 'అవును' పేరుతో సినిమా రూపంలోకి తెస్తున్నారు

    ఒక థ్రిల్లింగ్ కథాంశంతో ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. యామి గౌతమి తన జీవితంలో జరిగిన సంఘటన చెబుతున్నప్పుడు రవిబాబు కూడా చాలా ఎగ్జైట్ అయ్యాడట. ఆ కథ విన్న తర్వాత కొన్ని రోజుల పాటు లోన్లీగా ఉండటానికి భయట పడ్డాట. కొన్ని రాత్రులు నిత్రపోలేదట. లైట్లు ఆర్పడానికి కూడా భయపడే వాడట. మరి సినిమా కూడా అదే విధంగా భయ పెట్టే విధంగా ఉంటుందో? ఏమో?

    చివరగా రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'నువ్విలా' చిత్రం మంచి టాక్ తెచ్చుకోవడంతో ఈ తాజా చిత్రంపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. సినిమా జయాపజయాలను పక్కన పెడితే సినిమాను వైవిద్యంగా తెరకెక్కించడం రవిబాబు స్పెషాలిటీ. దీనికితోడు ఆయన సినిమాల్లోని సంగీతం కూడా వీనులవిందుగా ఉంటుంది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.

    English summary
    Ravi babu is one of the most intelligent and brave directors of Tollywood. Although he inspires a lot from Hollywood movies, his upcoming film ‘Avunu’ is based on the true life story of popular heroine Yami Gautam who worked with him for ‘Nuvvila.’
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X