భయపెట్టే..(రవిబాబు ‘అవును’ప్రివ్యూ )
కొత్తగా పెళ్లైన ఓ జంట ఓ ఇంట్లోకి షిప్ట్ అయినప్పుడు ఏం జరిగింది అనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు... మనతోపాటు ఎవరో ఉన్నారు, కానీ వాళ్లెవరో తెలియడం లేదు, కనిపించడం లేదు అనే భావన కలిగిన వెంటనే వెన్నులో వణుకుపుడుతుంది కదా. ఈ కథలోనూ అంతే. హీరోయిన్ కి అలాంటి అనుభవాలే ఎదురవుతాయి. విలన్ ఉన్నాడు... కానీ కనిపించడు. అతని బారి నుంచి ఎలా తప్పించుకుందన్నదే అసలు కథ.
రవిబాబు మాట్లాడుతూ...ఈ చిత్రంలో చీకటి నేపథ్యం లేదు. ఆత్మలు పగలే, మంచి కాంతివంతమైన వాతావరణంలో కంగారు పుట్టిస్తాయి. భయపడటం కూడా వినోదంలో భాగమే. వంద మంది మధ్యలో కూర్చొని కూడా... తెరపైన సన్నివేశాలకు అనుగుణంగా స్పందిస్తూ భయపడటం... థియేటర్ బయటకు వచ్చాక దాని గురించి మాట్లాడుకోవడం సరదాగా అనిపిస్తుంది. అందుకే థ్రిల్లర్, హారర్ తరహా చిత్రాలకు ఆదరణ ఉంటోంది అన్నారు.
పతాకం: ఫ్లయింగ్ ఫ్రాగ్స్
నటీనటులు: పూర్ణ, హర్షవర్ధన్‌రాణె, ఎవిఎస్ అల్లుడు చక్రవర్తి, భార్గవి, చలపతిరావు, ఢిల్లీ రాజేశ్వరి, మాస్టర్ గౌరవ్ తదితరులు
ఛాయాగ్రహణం: సుధాకర్ రెడ్డి
సంగీతం: శేఖర్ చంద్ర
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రవిబాబు
నిర్మాతలు: డి.సురేష్‌బాబు, పి.వి.పి. అధినేత పొట్లూరి వరప్రసాద్, రవిబాబు
విడుదల తేదీ :21, సెప్టెంబర్ 2012


Click it and Unblock the Notifications












