రవిబాబు ‘అవును’ పెట్టుబడి ఎంత? లాభం ఎంత?
ఈ చిత్రం పెద్ద సురేష్ ప్రొడక్షన్స్ మరియు పివిపి సినిమా బేనర్ సరమర్పణలో ఈచిత్రాన్ని భారీగా విడుదల చేసారు. పెద్ద సినిమాలేవీ లేక పోవడం, భారీగా థియేటర్లలో విడుదల చేయడంతో ఈచిత్రం ఇప్పటిటకే రూ. 3.50 కోట్లు వసూలు చేసింది. పెట్టున పెట్టుబడికి ఇన్ని రెట్లు లాభాలు రావడంతో దర్శక నిర్మాతలు చాలా హ్యీపీగా ఉన్నారు.
ఒక థ్రిల్లింగ్ కథాంశంతో ఈచిత్రాన్ని రూపొందించారు. హీరోయిన్ యామి గౌతమి జీవితంలో జరిగిన ఒక యాదార్థ సంఘటన సంఘటన ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. రియల్ సంఘటనకు రవిబాబు క్రియేటివిటీ జత చేసి హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దారు.
సినిమా కథ విషయానికొస్తే...కొత్తగా పెళ్లైన మోహిని ఆమె భర్త హర్ష హైదరాబాద్ గండిపేట దగ్గరలో 'క్లాసిక్ హోమ్స్'లో దిగుతాడు. అయితే ఆ ఇంటిలోకి చేరిన దగ్గరనుంచి రకరకాల వింత అనుభవాలు ఎదురౌతుంటాయి. ముఖ్యంగా ఆమెను ఎవరో వెనక నుంచి గమనిస్తున్నట్లు, తను బట్టలు మార్చుకునేటప్పుడు ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్లు ఫీలవుతూంటుంది. ఈ నేపథ్యంలో చనిపోయిన తన తాతతో మాట్లాడే... ప్రక్కింటి పిల్లాడు విక్కి ద్వారా తమ ఇంట్లో కెప్టెన్ రావు ఆత్మ ఉన్నట్లు తెలుసుకుంటారు. అయితే ఈలోగా ఈ తల నొప్పులు నుంచి తప్పించుకోవటానికి ప్యారిస్ కు హానీమూన్ ట్రిప్ ఏర్పాటు చేసుకుంటారు. అయితే అప్పటినుంచి ఆ ఆత్మ తన విశ్వరూపం చూపెడుతుంది. ఈ నేపథ్యంలో ఆ జంట ఏం చేసింది అనేది క్లుప్తంగా ఈచిత్రం కథాంశం.


Click it and Unblock the Notifications












