ఫిట్‌నెస్ ఛాలెంజ్: రవిబాబు ఏం చేశాడో చూస్తే ఆశ్చర్యపోతారు!

By Bojja Kumar

నటుడు, దర్శకుడు రవి బాబు ఏం చేసినా తనదైన ప్రత్యేకత చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న ఫిట్ నెస్ ఛాలెంజ్ ఆయన తనదైన శైలిలో చేశారు. 'హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌' భాగంగా ఆయన తన పెంపుడు పంది పిల్లతో ఫిట్ నెస్ ఛాలెంజ్ చేశారు. తన తాజా మూవీ 'అదుగో'లో ఈ పంది పిల్లనే ప్రధాన పాత్రగా పెట్టి రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. బంటి ఫిట్‌నెస్‌ కోసం వ్యాయామం చేయగలుగుతోందని, మరి మీరు ఎందుకు చేయరని రవి బాబు వ్యాఖ్యానించారు.

చాలా రోజుల క్రితమే 'అదుగో' షూటింగ్ పూర్తయింది. సినిమాలో గ్రాఫిక్స్ ఎంతో కీలకం. ఈ పనుల వల్లే సినిమా విడుదల ఆలస్యం అవుతోంది. ఇది పంది పిల్ల చుట్టూ తిరిగే కథ అని, ఆద్యంతం వినోదాన్ని పంచుతుందని రవిబాబు వెల్లడించారు. అభిషేక్, నాభ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

Ravi Babu fitness challenge with piglet

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన తరచూ పంది పిల్లతో ఏదో ఒక వీడియో పోస్టూ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన ఈ పంది పిల్లకు బ్రష్ చేయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

టాలీవుడ్లో పంది పిల్లపై సినిమా రావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఎవరూ తెరకెక్కించని డిఫరెంట్ కాన్సెప్టు కావడంతో ఏం చూపించబోతున్నారో? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫ్లయింగ్ ప్రాగ్స్ ప్రొడక్షన్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X