రామ్ చరణ్ సినిమాలో రవిబాబు కామెడీగా...!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రచ్చ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా లీడ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో రామ్ చరణ్ మెడికల్ స్టూడెంట్ పాత్రలో కనిపించనున్నాడు. యాక్షన్ అండ్ మాస్ ఎంటర్ టైన్మెంట్ కలగలిపి ఉండే ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటకు లీకైంది. విలక్షణ నటుడి నుంచి దర్శకుడిగా మారిన రవిబాబు ఈ సినిమాలో కామెడీ క్యారెక్టర్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. దర్వకుడు సంతప్ నంది రవిబాబు పాత్రను డిఫరెంట్ షేడ్స్ లో డిజైన్ చేశారని సమాచారం.
ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ నిర్మిస్తున్న రచ్చ చిత్రం మార్చిలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాలో కేవలం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణకు రూ. 2 కోట్ల వరకు ఖర్చ పెడుతున్నారు. ఇటీవల బ్యాంకాక్, చైనా, శ్రీలంకలో యాక్షన్ సీన్లు చిత్రీకరించారు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న మణిశర్మ...చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











