కొంపముంచిన పంది పిల్ల... రవిబాబుకు భారీ నష్టం!
టాలీవుడు దర్శకుడు రవిబాబు రోటీన్‌కు భిన్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కమర్షియల్ సక్సెస్ సాధించడంలో విఫలమయ్యాడని చెప్పక తప్పదు. ఆయన నుంచి వచ్చిన మరో విభిన్నమైన చిత్రం 'అదుగో'.
'అదుగో' సినిమాతో కమర్షియల్ సక్సెస్ కొట్టాలని భావించిన రవిబాబు ఈ సినిమాను తన సొంత ఖర్చుతో తెరకెక్కించారు. తెలుగులో ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా పంది పిల్లతో సినిమా తీశారు. ఇందుకోసం ఆయన స్వయంగా ఓ పంది పిల్లను పెంచుకుంటూ వార్తల్లోకి ఎక్కారు.

అధిక మొత్తం దాని కోసమే...
విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా సాగే ‘అదుగో' కోసం రవిబాబు చాలా కాలం కష్టపడ్డారు. ఈ సినిమా మీద ఖర్చు కూడా భారీగానే పెట్టారు. సినిమాలో నటీనటులు, ప్రొడక్షన్ కాస్ట్ కంటే పంది పిల్ల గ్రాఫిక్స్ కోసమే ఎక్కువ మొత్తం వెచ్చించారట.

బాక్సాఫీసు వద్ద బోల్తా
దీపావళి సందర్భంగా ‘అదుగో' సినిమా విడుదలైంది. బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశించిన ఈ చిత్రం ఊహించని విధంగా బోల్తా పడింది. ప్రేక్షకుల నుంచి సరైన స్పందన రాక పోవడంతో భారీ నష్టం వాటిల్లినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

ఫలితం ముందే ఊహించారా?
‘అదుగో' బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాదని రవిబాబు, సురేష్ బాబు ముందే ఊహించారా? అందుకే ప్రమోషన్స్ విషయంలో పెద్దగా ఖర్చు పెట్టకుండా సింపుల్‍గా కానిచ్చేశారా?.... అంటే అవును అని అనుమానించక తప్పడం లేదు.

ఫలితం ఇవ్వని పంది పిల్ల పాదయాత్ర
‘అదుగో' రిలీజ్ ముందు పంది పిల్లతో పాద్ర యాత్ర చేయడం తప్ప సినిమా పబ్లిసిటీ విషయంలో అంతగా కేర్ తీసుకోలేదు. సరైన పబ్లిసిటీ లేక పోవడం కూడా ‘అదుగో' ప్రేక్షకులకు రీచ్ కాక పోవడానికి కారణం అని మరికొందరి వాదన.


Click it and Unblock the Notifications











