పంది పిల్లతో ఏం చేశాడో చూశారా? వైరల్ అవుతున్న రవిబాబు వీడియో!
అల్లరి, అమ్మాయిలు అబ్బాయిలు, అవును లాంటి వినూత్నమైన చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు త్వరలో 'అదుగో' అనే డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పంది పిల్ల ప్రధాన పాత్రలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ సినిమా కోసం ఏ దర్శకుడు చేయని పని చేస్తున్నాడు రవిబాబు. ఏకంగా ఓ పంది పిల్లను పెంచుకుంటున్నాడు. దాని ఆలనా పాలనా స్వయంగా తానే చూసుకుంటున్నాడు. తాజాగా అతడు తన పంది పిల్లకు బ్రష్ చేయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను రవిబాబు తండ్రి, ప్రముఖ నటుడు చలపతి రావు షేర్ చేశారు.
చాలా రోజుల క్రితమే 'అదుగో' షూటింగ్ పూర్తయింది. సినిమాలో గ్రాఫిక్స్ ఎంతో కీలకం. ఈ పనుల వల్లే సినిమా విడుదల ఆలస్యం అవుతోంది. ఇది పంది పిల్ల చుట్టూ తిరిగే కథ అని, ఆద్యంతం వినోదాన్ని పంచుతుందని రవిబాబు వెల్లడించారు. అభిషేక్, నాభ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

టాలీవుడ్లో పంది పిల్లపై సినిమా రావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఎవరూ తెరకెక్కించని డిఫరెంట్ కాన్సెప్టు కావడంతో ఏం చూపించబోతున్నారో? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫ్లయింగ్ ప్రాగ్స్ ప్రొడక్షన్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











