అందుకే అతను రవిబాబు అయ్యాడు.. వీడియో వైరల్

రవిబాబు.. ఈయన పేర తెలియన వారెవరూ ఉండరు. విలక్షణ నటుడే కాదు.. విభిన్న చిత్రాలను తెరకెక్కించే సత్తా ఉన్న దర్శకుడు. ఈయన సినిమాలను చూస్తేనే అర్థమవుతుందని రవిబాబు ఎంత విచిత్రమైన వ్యక్తో. అయితే కేవలం సినిమా వరకు ఇలా ఉంటారనుకుంటే పొరబాటే నిజ జీవితంలోనూ ఆయన అంతే. అందరి కంటే భిన్నంగా ఆలోచిస్తూ, వెరైటీ పనులను చేస్తాడు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ కథ ఏంటో ఓ సారి చూద్దాం.

ప్రస్తుతం ప్రపంచం అంతా కరోనా కోరల్లో చిక్కుకుని ఉంది. రోజురోజుకూ పరిస్థితి దిగజారిపోవడమే తప్ప.. మెరుగు పడుతుందన్న ఆశే కనబడటం లేదు. కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ను అమలు పరిచినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అందుకే ఈ ఐదో దశలో లెక్కలేనన్ని సడలింపులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో జన జీవనం సాధారణ స్థితికి వచ్చింది. ఈ క్రమంలో ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. దర్శకుడు రవిబాబు సైతం షాపింగ్ చేసేందుకు సూపర్ మార్కెట్‌కు వెళ్లాడు.

Ravi Babu Testing Security Guard At Shopping Mall

కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రతీ మాల్ ఎంట్రీ దగ్గర మనల్ని టెస్ట్ చేసే పరికరం ఒకటి ఉంటుంది. ఆ క్రమంలోనే రవిబాబు ఆ మాల్‌లోకి ఎంట్రీ ఇస్తుండగా.. సెక్యూరిటీ ఆయనను టెస్ట్ చేశాడు. ఆపై వెంటనే రవిబాబు తన జేబులోంచి టెస్టింగ్ టూల్‌ను బయటకు తీసి సెక్యూరిటీని కూడా పరీక్షించాడు. మనల్ని పరీక్షించడమే కాదు వారిని కూడా పరీక్షించాలనే సందేశాన్ని ఇచ్చినట్టుగా ఉన్న ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. వారికి ఒకవేళ లక్షణాలు ఉంటే ఎలా? రవిబాబు చేసింది కరెక్టే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X