twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవి బాబు డైరెక్షన్లో వెంకటేష్?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టాలీవుడ్ డైరెక్టర్ రవి బాబు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ‘అల్లరి' సినిమాతో డైరెక్టరుగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన అనసూయ, అమరావతి, మనసారా, నువ్విలా, అవును చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన అవును-2 చిత్రం ఇటీవలే విడుదలైంది.

    ఇప్పటి వరకు చిన్న చిన్న యాక్టర్లతో సినిమాలు చేసిన ఆయన త్వరలో ఓ టాప్ యాక్టర్ తో సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇటీవల మీడియా వారు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ వెంకటేష్ కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అది డెవలపింగ్ దశలోనే ఉందని తెలిపారు.

    Ravi Babu to direct Venkatesh

    స్క్రిప్టు పూర్తయిన తర్వాత వెంకటేష్ కు చెబుతానని, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే సినిమా చేయడానికి రెడీ అని రవిబాబు తెలిపారు. వాస్తవానికి తన తొలి సినిమానే వెంకటేష్ బాబుతో చేయాలని ప్లాన్ చేసుకున్నాడు రవిబాబు అయితే అది మొదలు కాలేదు. మరి ఈ సారైనా వెంకీకి అవకాశం దక్కుతుందో? లేదో?

    ఆయన తాజా సినిమా ‘అవును-2' విశేషాల్లోకి వెళితే...హర్షవర్థన్ రానె, పూర్ణ , నిఖిత, సంజన, చక్రవర్తి, రవివర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపిస్తోంది. రెగ్యులర్ రవిబాబు సినిమాల్లో లాగానే...కెమెరా వర్క్ ముఖ్యంగా లైటింగ్, ఫ్రేమింగ్, మూడ్ క్రియేట్ చేయటం ఈ సినిమాలోనూ బాగుంది. ఈ సినిమాలో లైటింగ్ సిస్టమ్ పనితనాన్ని కొత్తగా ఆస్వాదిస్తారు. పూర్తి ఎల్‌ఈడీ లైట్లతో లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఎక్కడా కేబుల్ అనేదే లేకుండా సినిమాకి లైటింగ్ సమకూర్చారు. లిమెటెడ్ బడ్జెట్ లో చేసినా విజువల్ ఎఫెక్టులు బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాస్త నిదానంగా ఇచ్చి ఉంటే బాగుండేది. ఏదో హడావిడి చేసిన ఫీలింగ్ కొన్ని సన్నివేశాల్లో వచ్చింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. డైలాగులు ఓకే. దర్శకుడుగా రవిబాబు..మొదటి పార్ట్ లో మ్యాజిక్ ఇందులో చూపలేకపోయారు.

    English summary
    Director Ravi Babu’s latest movie Avunu 2 is receiving mixed reviews from the audiences. Ravi Babu wanted to direct Tollywood’s top actor. While interacting with media recently, he said that he has been preparing a script for Venkatesh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X