Don't Miss!
- Sports ఛాంపియన్‌లా వస్తున్నాం.. ఇది ఆరంభం మాత్రమే - పంత్
- News క్రైస్తవ పాఠశాలపై హిందువుల దాడి
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
రవి బాబు డైరెక్షన్లో వెంకటేష్?
హైదరాబాద్: టాలీవుడ్ డైరెక్టర్ రవి బాబు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ‘అల్లరి' సినిమాతో డైరెక్టరుగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన అనసూయ, అమరావతి, మనసారా, నువ్విలా, అవును చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన అవును-2 చిత్రం ఇటీవలే విడుదలైంది.
ఇప్పటి వరకు చిన్న చిన్న యాక్టర్లతో సినిమాలు చేసిన ఆయన త్వరలో ఓ టాప్ యాక్టర్ తో సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇటీవల మీడియా వారు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ వెంకటేష్ కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అది డెవలపింగ్ దశలోనే ఉందని తెలిపారు.
స్క్రిప్టు పూర్తయిన తర్వాత వెంకటేష్ కు చెబుతానని, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే సినిమా చేయడానికి రెడీ అని రవిబాబు తెలిపారు. వాస్తవానికి తన తొలి సినిమానే వెంకటేష్ బాబుతో చేయాలని ప్లాన్ చేసుకున్నాడు రవిబాబు అయితే అది మొదలు కాలేదు. మరి ఈ సారైనా వెంకీకి అవకాశం దక్కుతుందో? లేదో?
ఆయన తాజా సినిమా ‘అవును-2' విశేషాల్లోకి వెళితే...హర్షవర్థన్ రానె, పూర్ణ , నిఖిత, సంజన, చక్రవర్తి, రవివర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపిస్తోంది. రెగ్యులర్ రవిబాబు సినిమాల్లో లాగానే...కెమెరా వర్క్ ముఖ్యంగా లైటింగ్, ఫ్రేమింగ్, మూడ్ క్రియేట్ చేయటం ఈ సినిమాలోనూ బాగుంది. ఈ సినిమాలో లైటింగ్ సిస్టమ్ పనితనాన్ని కొత్తగా ఆస్వాదిస్తారు. పూర్తి ఎల్ఈడీ లైట్లతో లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఎక్కడా కేబుల్ అనేదే లేకుండా సినిమాకి లైటింగ్ సమకూర్చారు. లిమెటెడ్ బడ్జెట్ లో చేసినా విజువల్ ఎఫెక్టులు బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాస్త నిదానంగా ఇచ్చి ఉంటే బాగుండేది. ఏదో హడావిడి చేసిన ఫీలింగ్ కొన్ని సన్నివేశాల్లో వచ్చింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. డైలాగులు ఓకే. దర్శకుడుగా రవిబాబు..మొదటి పార్ట్ లో మ్యాజిక్ ఇందులో చూపలేకపోయారు.