ఆ రీమేక్ తో రవిబాబు?

By Staff

Ravibabu
నచ్చావులే విజయంతో జోరు మీదున్న రవిబాబు ఇప్పుడు ఓ హిందీ రీమేక్ చిత్రానికి శ్రీకారం చుట్టనున్నారని వినిపిస్తోంది. మాధవన్ హీరోగా హిందీలో రిలీజైన "13B" చిత్రాన్ని ఆయన తన నిర్మాతలతో కొనిపించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అంతకుముందు భూమిక ప్రధాన పాత్రలో ఆయన తీసి విజయం సాధించిన అనసూయ తరహాలో ఈ చిత్రం కూడా ధ్రిల్లర్ కావటంతో ట్రేడ్ లో కూడా మంచి అంచనాలపుట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే రవిబాబు రెగ్యులర్ గా ఫాలో అయ్యే లో బడ్జెట్..బిగ్ సక్సెస్ సెంటిమెంట్ కూడా ఈ సినిమాతో రిపీట్ అవుతుందని ఆయన ఆశిస్తున్నారని తెలుస్తోంది.

ఇక "13B" లో హీరో ఫ్యామిలీతో సహా కొత్తగా కొనుక్కున్నఫ్లాట్ లోకి షిప్ట్ అవుతాడు. అక్కడ అనుకోని వింత సంఘటనలు చోటు చేసుకుంటాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చే టీవీ సీరియల్ లో ఏ సీన్స్ వస్తూంటాయో అవే అతని కుటుంబం లో సంఘటనలుగా జరుగుతూంటాయి. అలాగే ఆ సీరియల్ వాళ్ళింట్లో మాత్రమే వస్తూంటుంది. అలా సస్పెన్స్ తో సాగే ఈ సినిమాను ఎంచుకుని రవిబాబు ఏ అధ్బుతం సృష్టించనున్నారో వేచి చూడాల్సిందే. ఇప్పటికే రవిబాబు ఏజెంట్ గోపి, అమరావతి అనే రెండు టైటిల్స్ రిజిస్టర్ చేయించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X