కనీసం అలాగైనా బతుకుతాడట.. రవిబాబు తంటాలు వైరల్

కరోనా వైరస్ ఎందరి జీవితాలను నాశనం చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పని దొరక్కుండా చేసి కొందర్నీ, ఆహారం దొరక్కుండా మరికొందరు కరోనా కబళించింది. రోజురోజుకూ కరోనా విస్తరిస్తూనే ఉంది. మన దేశంలో మరీ పరిస్థితి చేజారిపోతోన్నట్టు కనిపిస్తోంది. అందులో మరీ ముఖ్యంగా తెలంగాణ పరిస్థితి దయనీయమైన స్థితిలో ఉంది. హైద్రాబాద్‌లో రోజుకు బయట పడుతున్న కేసులను చూస్తే ఎవ్వరైనా షాక్ కావాల్సిందే.

ఇలాంటి సమయంలో సాధారణ పరిస్థితి రావడానికి చాలాకాలమే పట్టొచ్చు. అంతవరకు సినిమా షూటింగ్‌లు, థియేటర్ సమస్యలు, ఇండస్ట్రీ వ్యవహారాలు చక్కబడవు. అందుకే రవిబాబు కొత్త రంగాన్ని ఎంచుకున్నాడు. ఇక ఇందులోనే ఉంటే బతుకు సాగించడం కష్టమని భావిస్తున్నాడు. ఇందులోంచి వచ్చిన ఆలోచననే ఆచరణలో పెట్టాలని విపరీతంగా ప్రయత్నిస్తున్నాడు. అందుకోసం రవిబాబు చాలానే తంటాలు పడుతున్నాడు.

Ravi Babu Wants To Become Tea Master

కరోనా తగ్గకపోయినా.. సాధారణ పరిస్థితులు వచ్చి షూటింగ్‌లు చేసుకునే దారి లేకపోయినా కొత్త కెరీర్‌ను చూసుకునేపనిలో పడ్డాడట రవిబాబు. ఈ మేరకు టీ మాష్టర్ అవతారమెత్తాడు. ప్రొఫెషనల్ టీ మాష్టర్స్ చేసినట్టుగా చాయ్‌ను అంత ఎత్తునుంచి వడబోసేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ అలా చేయడం రవిబాబు వల్ల కావడం లేదు. దీంతో రవిబాబుకు చిరాకు పుట్టినట్టుంది. ఈ తతంగాన్ని అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం రవిబాబు వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ మధ్య సెక్యూరిటీ గార్డ్ టెంపరేచర్‌ను చెక్ చేసిన వీడియో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఆయన ప్రస్తుతం క్రష్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X