»   »  రవితేజ నైట్ పార్టీ...హాట్ హీరోయిన్స్ రచ్చ

రవితేజ నైట్ పార్టీ...హాట్ హీరోయిన్స్ రచ్చ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రిపబ్లిక్ డే నే హీరో రవితేజ పుట్టిన రోజు జరుపుకొన్న సంగతి తెలిసిందే. ఈ వేడుకని రవితేజ ఎప్పటిలాగే చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు. అయితే ఈ సారి సెలబ్రేషన్స్ లో హీరోయిన్స్ రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రాశీఖన్నాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

అక్కడ రవితేజ స్టయిల్‌లో మీసాలు పెట్టుకుని రవితేజను అనుకరిస్తూ.. రచ్చ రచ్చ చేశారు. ఈ సందర్భంగా ఈ హీరోయిన్స్ ఇద్దరూ కలిసి తీసుకున్న ఓ సెల్ఫీని రకుల్‌ప్రీత్‌ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. రవితేజ స్టయిల్‌లో ఉన్న ఈ హీరోయిన్స్ మీరు కూడా చూడండి.

Ravi hanging with hot girls@Birthday party

ఇక వీళ్లిద్దరూ రీసెంట్ గా వచ్చిన రవితేజ చిత్రాల్లో నటించారు. రవితేజ నటించిన బెంగాల్ టైగర్ చిత్రంలో రాఖీ మాస్ రాజాతో కలిసి ఆడిపాడింది. ఇక రకుల్ కిక్ 2 చిత్రంలో రవితేజ సరసన సందడి చేసింది.

Ravi hanging with hot girls@Birthday party

రవితేజ కెరీర్ విషయానికి వస్తే... దిల్ రాజు నిర్మతగా మొదలెట్టిన ఎవడో ఒకడు అనే చిత్రం ఆగిపోయినట్లే అని తెలుస్తోంది. త్వరలో సుధీర్ వర్మ డైరెక్షన్‌లో ఓ చిత్రాన్ని, కొత్త దర్శకుడు చక్రి తో మరో చిత్రాన్ని చేయనున్నారు. చక్రి దర్శకత్వంలో చేయబోయే చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తారని అంటున్నారు. ఈ హీరోయిన్స్ ఇద్దరూ మళ్లీ రవితేజతో కనిపించనున్నారన్నమాట.

English summary
Raviteja has thrown another big birthday bash for which many hot ladies have attended. Among them, Rakul Preet and Rashi Khanna have stunned all with their funny acts. By wearing moustaches, these two simply rocked the night.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu