'భలేదొంగలు ,జల్సా' తరువాత తన పెరిగిన రెమ్యునేషన్ కి, తగ్గిన క్రేజ్ కి సినిమాలు ఎలా వస్తాయో అర్ధం కాని స్థితిలో ఉన్న ఇలియానా కి ప్రాణం లేచొచ్చినట్లయింది. 'పోకిరి' తో ఆమెను మోస్ట్ వాండెట్ హీరోయిన్ గా మార్చిన పూరీ మళ్ళీ లిప్ట్ ఇవ్వనున్నాడు. రవితేజ తో తాను చేయనున్న 'నేనింతే' చిత్రంలో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నాడు. ప్రస్తుతం పూరీ బుజ్జిగాడు పూర్తి చేసి తన రెగ్యులర్ స్క్రిప్ట్ డిస్కషన్స్ ప్లేసు అయిన బ్యాంకాక్ వెళ్ళటానికి రెడీ అవుతున్నారు. ఇలియానా ముంబయి లో సమ్మర్ హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తోంది. రవితేజ సురేష్ ప్రొడక్షన్స్ వారి సినిమాలో బిజీగా ఉన్నాడు. యోదైమైనా ఈ ఖతర్నాక్ జంట ఈ సారైనా మంచి విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.