రావి కొండలరావుకు గురజాడ పురస్కారం
సినీనటుడు, ప్రముఖ రచయిత అయిన రావి కొండలరావుకు గురజాడ పురస్కారం లభించింది. విజయనగరంలో గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆ ధ్వర్యంలో సోమవారం గురజాడ విశిష్ట పురాస్కారాన్ని రావి కొండలరావు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గొప్ప కళాకారులు, సాహితీవేత్తలకు ఇచ్చే గురజాడ పురస్కారం తనకు ల భించడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రముఖ రచయిత, సినీనటుడు రావి కొండలరావు అన్నారు. అలాగే కన్యాశుల్కం నాటకాన్ని టీవీ, తెరపైకి ఎక్కించటానికి తాను చాలా ధైర్యం చేశానన్నారు. ప్రముఖ సినీనటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మాట్లాడుతూ రావికొండలరావు గొప్ప నటుడని కొనియాడారు. రావి కొండలరావు దంపతులను గురజాడ సమాఖ్య సన్మానించింది. కార్యక్రమంలో ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, సమాఖ్య అధ్యక్షులు పీవీ నర్సింహరాజు, కోశాధికారి డాక్టర్ గోపాలరావు, మేకా కాశీవిశ్వేశ్వరుడు తదితరులు పాల్గొన్నారు. రావికొండలరావు రచించిన సినిమా కథలు భైరవద్వీపం, బృందావనం,పెళ్ళి పుస్తకం కూడా మంచి విజయం సాధించటం తెలిసిందే.


Click it and Unblock the Notifications











