రవికుమార్ చౌదరి ప్రాణం పెట్టి చేసాడు
నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, అన్న, ఎర్ర మందారం వంటి అభ్యుదయ చిత్రాలను తీసిన ఈతరం మూవీస్ తాజాగా 'ఏం పిల్లో.. ఏం పిల్లడో' అనే చిత్రంతో ముందుకు వస్తోంది.గతంలో ఇదే బ్యానర్ పై యజ్ఞం చిత్రం రూపొందించిన ఎఎస్ రవికుమార్ చౌదరి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. తనీష్ హీరోగా ప్రణీతను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ పోకూరి బాబూరావు నిర్మిస్తున్న ఈ చిత్రం మూడు పాటలు మినహా పూర్తయింది. ఈ చిత్ర విశేషాలను వెల్లడించడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.
ఈ సందర్బంగా పోకూరి బాబూరావు మాట్లాడుతూ 'మా సంస్థ నిర్మిస్తున్న 15వ చిత్రమిది. యూత్‌ఫుల్‌గా ఉండే ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సహజంగా మా చిత్రాల్లో ఉండే ఎమోషన్స్‌ని క్యారీ చేస్తూ సినిమా సాగుతుంది. జనవరి ఒకటిన షూటింగ్ ప్రారంభించాం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది. మిగిలిన మూడు పాటలను త్వరలో చిత్రీకరించి ఈ వేసవిలోనే సినిమాను విడుదల చేస్తాం. రవికుమార్ చౌదరి ప్రాణం పెట్టి ఈ సినిమా తీశాడు. ఇందులో హీరోహీరోయిన్ల పాత్రలు నువ్వా నేనా అనే రీతిలో ఉంటాయి' అన్నారు.
దర్శకుడు రవికుమార్ చౌదరి మాట్లాడుతూ 'నా మాతృసంస్థలో పనిచేయడం ఇది రెండోసారి. ఈ సినిమాలో ప్రతి టెక్నీషియన్ ఒక హీరో కావడంతో మల్టీస్టారర్ చిత్రానికి పనిచేసిన అనుభూతి కలిగింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే సినిమా కావడంతో తప్పకుండా విజయవంతమవుతుందనే నమ్మకం ఉంది' అన్నారు.


Click it and Unblock the Notifications











