ఎ.ఎస్.రవికుమార్ సెకెండ్ ఇన్నింగ్స్
యజ్ఞం' వంటి హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్. ఆ తర్వాత వచ్చిన 'వీరభద్ర', 'ఆటాడిస్తా' ఫ్లాప్ అవడంతో దాదాపు కనుమరుగైపోయారు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. దీన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ "త్వరలోనే నాకు లైఫ్ ఇచ్చిన 'ఈతరం' బ్యానర్ పై ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నానని, దీనితో తన సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నానని చెప్పారు". కథాచర్చలు పూర్తయిన ఈ చిత్రంలో ఓ యువ కథానాయకుడు నటిస్తాడని, ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టుగా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు.
ఇప్పటి వరకూ తన కెరీర్ లో 'యజ్ఞం' చిత్రం తనకు సంతృప్తినిచ్చిదని, ఆ తర్వాత చేసిన 'వీరభద్ర' చిత్రవిషయంలో హాపీగా ఫీలయ్యానని, కానీ అందులో ప్రేక్షకుడికి కావలసినదేదో మిస్ అయిందని చెప్పారు. అలాగే నితిన్ తో చేసిన 'ఆటాడిస్తా' సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చిందని, ఇప్పుడు చెయ్యబోతున్న సినిమాతో తిరిగి తన కెరీర్ గాడీలో పడుతుందని అభిలాషించారు.
దట్స్ తెలుగు తరపున ఎ.ఎస్.రవికుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి సినిమాలు ఘన విజయం సాధించాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











