twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్ను అమ్మాయిల పిచ్చివాడిలా చూపిస్తారా..! : "అజహర్" మీద బీసీసీఐ కి ఫిర్యాదు చేసిన రవి శాస్త్రి

    |

    జట్టులో ఉన్నప్పుడు అజార్ చుట్టూ ఎప్పుడూ ఒక వివాదం తిరుగుతూనే ఉందేది. అదే లా ఇప్పుడు ఇప్పుడు ఆయన జీవితకథ ఆధారంగా తెరకెక్కిన "అజహర్" సినిమా చుట్టూ ంకూడా ఒకటి వెనుక ఒకటిగా వివాదాలు ముసురుకుంటున్నాయి. బాలీవుడ్ ముద్దుల హీరో ఇమ్రాన్‌ హష్మీ హీరోగా తెరకెక్కిన "అజహర్"పై ఇప్పటికే పలువురు ఆగ్రహం వ్యక్తం చేయగా.

    ఇప్పుడు తాజగా మాజీ క్రికెటర్‌ రవిశాస్త్రి కూడా ఈ చిత్రంలో తన పాత్రను చూపించిన తీరు చూసి షాక్‌ తిన్నాడంట.ఎంత చెడుగా చూపించాలనుకున్నా... మరీ ఇంత దారుణంగా నన్ను సినిమాలో చూపిస్తారా? అని మండిపడుతున్నాడట రవిశాస్త్రి. "అజార్‌" సినిమాలో రవిశాస్త్రి పాత్రను గౌతం గులాటీ పోషించాడు.

    అయితే ఇక్కడ సినిమాలో ఏ క్రికెటర్‌ పేరును పూర్తిగా ఉపయోగించలేదు. కానీ అజార్‌ క్రికెట్‌ ఆడుతున్నప్పుడు సహ క్రికెటర్లు పిలుచుకొనే పొట్టిపేర్లనే ఇందులో వాడారు.అందులో భాగంగానే అజార్‌, రవి, నవజ్యోత్, మనోజ్‌, కపిల్‌ వంటి పేర్లను ఉపయోగించారు.

    వీళ్లందరూ అజార్‌తో కలిసి క్రికెట్‌ ఆడినవాళ్లే. కాబట్టి సహజంగానే సినిమాలో వీరి ప్రస్తావన ఉంటుందని ముందే అంతా భావించారు. అయితే, గౌతం గులాటీ "రవి"గా కనిపించిన పాత్ర రవిశాస్త్రినే పోలి ఉంటుంది. ఆ పాత్రని పూర్తిగా అమ్మాయిల పిచ్చి ఉన్నవాడిగా చూపించటం, ఓ సీరిస్‌ సందర్భంగా తన వెంట ఉన్న భార్యను మోసపుచ్చి మరీ ఇంకో అమ్మాయితో గడిపినట్టు చూపించడం చూసి ఒరిజినల్ రవిసాస్ట్రి బిత్తరపోయాడట.

    Ravi Sastri furious on his character in azhar Movie

    రవిశాస్త్రి కుటుంబం కూడా ఆయనను ఇలా చూపించారేమిటని మండిపడుతున్నారు. తనను పోలి ఉన్న పాత్ర ద్వారా తనమీద చెడు అభిప్రాయం కలిగే లా ఆ పాత్రను చూపించిన తీరును తప్పుబడుతూ ఇప్పటికే రవిశాస్త్రి బీసీసీఐ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

    తన పాత్రను తప్పుగా చూపించడంపై అజహర్ "ఫిక్సింగ్ ఫ్రెండ్" మనోజ్‌ ప్రభాకర్‌ చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఇప్పటికే "అజార్‌" చిత్రయూనిట్‌ను హెచ్చరించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే అజారుద్దీన్ మాజీ భార్య సంగీత బిజ్లానీ కూడా ఈ సినిమాలో తనను చూపిన తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది.

    తన పాత్రని మరీ వల్గర్ గా చూపిమంచారని ఆమె అభిప్రాయ పడింది. మొత్తానికి తన క్యారెక్టర్ ని గొప్పగా చూపించేబందుకు అజర్ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక తప్పు తోసారన్నట్టు గా ఉందంటున్నారు అజహర్ అభిమానులు కూడా...

    English summary
    in "azhar" Ravi Shastri is dismayed at being depicted as a womaniser and even gone ahead and expressed his displeasure to the cricket authorities in the country.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X