రవి తేజాని టచ్ చేసిచూస్తే...!: టచ్ చేసి చూడు లీక్‌డ్ ఫొటోస్
మాస్ మహరాజ్ రవితేజ సినిమా కోసం అభిమానులు సంవత్సర కాలంగా ఎదురుచూస్తున్నారు. బెంగాల్ టైగర్ సినిమాతో డీసెంట్ హిట్ సాధించిన రవితేజ, ఆ తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందన్న తరుణంలో ఆగిపోవటంతో కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. అన్ని రోజుల తర్వాత వచ్చినా రాజా ది గ్రేట్ అనిపించుకున్నాడు. ఈ హిట్ తో రవితేజ మార్కెట్ మళ్ళీ ఊపందుకుంది.

రాజా ది గ్రేట్
సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్నా.. మాస్ మహరాజ్ రీఎంట్రీ అదిరిపోయింది. రాజా ది గ్రేట్ మూవీతో తన కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకున్న రవితేజ.. ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఏడాదిన్నరకు పైగా గ్యాప్ తర్వాత వచ్చినా సూపర్ హిట్ సినిమా ఇవ్వడంతో ఫ్యాన్స్ కూడా సంతోషంగానే ఉన్నారు. ఇప్పుడు రవితేజ నెక్ట్స్ మూవీపై ఆసక్తి పెరిగిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.

విక్రమ్ సిరికొండ
విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో టచ్ చేసి చూడు చిత్రంలో నటిస్తున్నాడు రవితేజ. ఈ సినిమాను సంక్రాంతి రేస్ లో నిలిపినట్లు నిర్మాతలు ఇప్పటికే చెప్పేశారు. అయితే.. ఇప్పటివరకూ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. షూటింగ్ ముందు విడుదల చేసిన మోషన్ టీజర్ తప్ప.. అసలు ప్రమోషన్ వర్క్స్ కూడా మొదలు కాలేదు.

షూటింగ్ స్పాట్ నుంచి లీక్
టచ్ చేసి చూడు మూవీలో రవితేజ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన ఓ పోస్టర్ ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారిపోయింది. పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కళ్లజోడు పెట్టుకున్న రవితేజ లుక్ నిజంగానే సూపర్బ్ గా ఉంది.

పోలీస్ పాత్రలో
రవితేజ మార్క్ స్టైల్ కూడా కొట్టొచ్చినట్లు తెలుస్తోంది. చివరగా పవర్ మూవీలో మాస్ మహరాజ్ పోలీస్ పాత్రలో కనిపించాడు. అప్పటికి ఇప్పటికి రవితేజ కాస్త సన్నబడిన సంగతి తెలిసిందే. అందుకే ఈ లుక్ లో కంటికి మరీ ఆనేస్తున్నాడు. ఇక పూర్తి స్థాయిలో అసలు టచ్ చేసి చూడు చూద్దాం అనే తరహా కేరక్టరైజేషన్ లో తమ హీరో ఏ రేంజ్ లో ఉంటాడో అని ఊహించేసుకుంటున్నారు అభిమానులు.


Click it and Unblock the Notifications











