ఆ రెండు సినిమాలకు సీక్వెల్స్ చేయాలని ఉంది.. క్లారిటీ ఇచ్చిన రవితేజ
మాస్ మహరాజా రవితేజ చాలా కాలం తరువాత క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది సమ్మర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఆపసోపాలు పడి థియేటర్స్ లోకి వచ్చింది. ఆలస్యం చేసినా ఇబ్బందుకు ఎదురైనా కూడా సినిమా ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంటోంది. అయితే చాలా కాలం తరువాత రవితేజ సీక్వెల్ చెయబోయే సినిమాలపై క్లారిటీ ఇచ్చాడు.
మాస్ రాజా తన కెరీర్ లో మొదటి సారి కిక్ సినిమాకు మాత్రమే డిఫరెంట్ గా సీక్వెల్ ను ట్రై చేసిన విషయం తెలిసిందే. కిక్ 2 డిజాస్టర్ కావడంతో మళ్ళీ అలాంటి ప్రయోగం చేయలేదు. ఇక చాలా రోజుల తరువాత క్రాక్ సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని ఉందని చెప్పాడు. అంతే కాకుండా రాజా ది గ్రేట్ సినిమాకు కూడా సీక్వెల్ చేయాలని ఉందని అన్నాడు. ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడి కూడా తప్పకుండా రాజా ది గ్రేట్ సీక్వెల్ ఉంటుందని చెప్పాడు.

క్రాక్ సినిమాను గోపీచంద్ మాలినేనీ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. పోలీస్ పాత్రలో కనిపించి మాస్ రాజా సెంటిమెంట్ హిట్ కొట్టాడు. గతంలో చాలా సినిమాల్లో పోలీస్ గా చేసి మాస్ రాజా సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక దర్శకుడు గోపిచంద్ మంచి కమర్షియల్ డైరెక్టర్ గా మరోసారి తన సత్తాను నితుపించుకున్నాడు. మరి క్రాక్ 2 ఆయన ఎప్పుడు సెట్స్ పైకి తెస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











