twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అయ్యో అంటూ... బాధ పడలేదు, ఎంజాయ్ చేశా: రవితేజ

    సరైన కథలు దొరకక పోవడం వల్లనే తన కెరీర్లో చాలా గ్యాప్ వచ్చిందని హీరో రవితేజ తెలిపారు.

    By Bojja Kumar
    |

    రవితేజ హీరోగా వచ్చిన 'రాజా ది గ్రేట్' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా కంటే ముందు రవితేజ దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకున్నారు. అయితే ఇది తాను కావాలని తీసుకున్న గ్యాప్ కాదని, సరైన స్క్రిప్టు దొరకక పోవడం వల్ల వచ్చిన గ్యాపే అని రవితేజ తెలిపారు.

    అయ్యో గ్యాప్ వచ్చిందే అని తాను ఎప్పుడూ బాధ పడలేదని, అలాంటి ఫీలింగ్ కూడా లేదని, అస్సలు రాదని రవితేజ తెలిపారు. ఈ రెండుళ్ల గ్యాపులో చాలా ఎంజాయ్ చేశానని, బోలెడు సినిమాలు చూశాను, ఎక్సర్ సైజ్ చేశాను, ట్రావెల్ చేశాను అని రవితేజ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

    యూరఫ్ ట్రిప్ వేశాను

    యూరఫ్ ట్రిప్ వేశాను

    తనకు యూరఫ్ అంటే చాలా ఇష్టమని, ఈ రెండేళ్ల గ్యాపులో చాలా ప్రదేశాలు తిరిగానని రవితేజ తెలిపారు. కెరీర్ గురించి బాధ పడింది ఎప్పుడూ లేదని రవితేజ స్పష్టం చేశారు.

    ఇండస్ట్రీలో స్నేహితులు లేరు

    ఇండస్ట్రీలో స్నేహితులు లేరు

    ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరని, తనకు తానే బెస్ట్ ఫ్రెండ్ అని రవితేజ అన్నారు. ఇండస్ట్రీలో అతి కొద్ది మందితో క్లోజ్ గా ఉంటానని, ఖాళీ సమయాల్లో వారిని కలుస్తుంటానని తెలిపారు.

    అమితాబ్ సినిమాలు చూస్తూ పెరిగాను

    అమితాబ్ సినిమాలు చూస్తూ పెరిగాను

    తాను పుట్టింది, పెరిగింది నార్త్ ఇండియాలోనే. చిన్నతనంలో అమితాబ్ సినిమాలు చూస్తూ పెరిగాను. తనకు తెలిసిన మొదటి సూపర్ స్టార్ ఆయనే అని అన్నారు. సౌత్ కు వచ్చిన తర్వాత చిరంజీవి అంటే ఇష్టం ఏర్పడిందన్నారు. చిరంజీవిగారు ఎందరికో ఇన్స్‌స్పిరేషన్ అని రవితేజ తెలిపారు.

    దిల్ రాజు అందరిలాంటోడు కాదు

    దిల్ రాజు అందరిలాంటోడు కాదు

    ఇండస్ట్రీలో చాలా మంది మంది ప్రొడ్యూసర్లు ఉంటారు. కానీ దిల్ రాజు మాత్రమే మేకర్ అని రవితేజ అన్నారు. దిల్ రాజు హార్డ్ వర్కర్ అని, అతడి జడ్జిమెంట్ చాలా కరెక్టుగా ఉంటుందని, క్వాలిటీగా సినిమాలు తీస్తారని రవితేజ తెలిపారు.

    రాజమౌళి వల్లనే ఇదంతా సాధ్యమైంది

    రాజమౌళి వల్లనే ఇదంతా సాధ్యమైంది

    రాజమౌళి వల్లనే తెలుగు సినిమాలకు జాతీయ స్థాయిలో ఒక రెస్పెక్ట్ వచ్చిందని, ఆయన తీసిన బాహుబలి ఒక వండర్ అని, ఆయన యూనిక్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని రవితేజ తెలిపారు. ఆయన వల్లనే తెలుగు సినిమా మార్కెట్ పరిధి పెరిగిందన్నారు.

    అనిల్ రావిపూడి గురించి

    అనిల్ రావిపూడి గురించి

    అనిల్ రావిపూడి గురించి రవితేజ మాట్లాడుతూ... గతంలో దరువు సినిమాకు రైటర్ గా చేశారు. తర్వాత ఆయనతో ‘పటాస్' సినిమా నేను చేయాల్సిందే కానీ కుదరలేదు. ‘రాజా ది గ్రేట్' సినిమాతో మా కాంబినేషన్ సెట్టయిందని రవితేజ అన్నారు.

    రాజా ది గ్రేట్ సినిమా

    రాజా ది గ్రేట్ సినిమా

    రాజా ది గ్రేట్ సినిమా అందరినీ ఎంటర్టెన్ చేసే సినిమా. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఉన్న బ్లైండ్ క్యారెక్టర్ ఇప్పటి వరకు రాలేదు అని రవితేజ తెలిపారు

    ఎవరికీ మెసేజ్‌లు ఇవ్వను

    ఎవరికీ మెసేజ్‌లు ఇవ్వను

    నేను నా సినిమాల ద్వారా ఎవరికీ మెసేజ్ ఇవ్వాలని చూడను, ఎందుకంటే ఇక్కడ మెసేజ్ తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. నా సినిమాల ద్వారా ఎంటర్టెన్మెంట్ మాత్రమే ఇవ్వాలని చూస్తాను అని రవితేజ తెలిపారు.

    English summary
    Ravi Teja talked about two year gap in her career. He said that the gap came because he did not find the right stories for him. He said that he enjoyed this time and never worried.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X