కిక్‌-అరుంధతి-మగధీర కాంబినేషన్‌లో..

By Staff

ఏంటీ కాంబినేషన్ అని ఆశ్చర్యపోతున్నారా. ఏం లేదండీ ఈ యేటి బిగ్గెస్ట్ హిట్ మూవీస్ గా నిలిచిన చిత్రాలు అరుంధతి, కిక్, మగధీర చిత్రాల్లో తమ నటనతో అందరిచేత భేష్ అనిపించున్న నటీనటులు ఓ సినిమాలో కలసి నటించనున్నారు. 'కిక్' సినిమాలో కిక్కు కావాలని అందరినీ ముప్పతిప్పలు పెట్టిన రవితేజ కథానాయకుడిగా, 'అరుంధతి' చిత్రంలో జేజమ్మగా అందరి ప్రశంసలు పొందిన అనుష్క హీరోయిన్ గా 'కిక్' చిత్రాన్ని నిర్మించిన ఆర్ ఆర్ మూవీ మేకర్స్ ఓ సినిమాని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ఈ ఏడాదిలో విడుదలయ్యి టాలీవుడ్ రికార్డులన్నింటినీ షేక్ చేసిన 'మగధీర' చిత్రంలో షేర్ ఖాన్ గా నటించిన శ్రీ హరి ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. ఇన్ని విశేషాలున్న ఈ చిత్రం ద్వారా గోపీచంద్ మలినేని అనే ఓ యువకుడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అక్టోబరు నుండీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ చిత్రం ఏ రేంజ్ లో వుండబోతోందో తెలుసుకోవాలంటే వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X