Don't Miss!
- News
బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Sports
Satender Malik: రిఫరీపై పిడిగుద్దులు.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం!
- Technology
Windows 11లో వర్చువల్ మెమరీని పెంచి సమస్యలకు చెక్ పెట్టడం ఎలా?
- Automobiles
మే 19న జీప్ మెరిడియన్ Jeep Meridian ఎస్యూవీ విడుదల, డీటేల్స్
- Finance
కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు
- Lifestyle
Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బాలకృష్ణతో రవితేజ జోడీ: మాస్ హీరోలను డీల్ చేయనున్న యంగ్ డైరెక్టర్.. మాస్ ఫీస్ట్‌కు రంగం సిద్ధం
సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ తిరుగులేని హీరోగా వెలుగొందుతున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా.. తనదైన నటన, డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ కొన్ని కోట్ల మందికి అభిమాన హీరోగా మారిపోయారు. ప్రేక్షకులను అలరించేందుకు నిరంతరం సాహసాలు చేస్తూ వస్తున్న ఆయన.. ఆరు పదుల వయసులోనూ ప్రయోగాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఇప్పుడు బాలకృష్ణ ఆహా సంస్థ కోసం 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' అనే షోతో హోస్టుగా పరిచయం అయ్యారు. ఇందులో కూడా తనదైన యాంకరింగ్‌తో సత్తా చాటుతున్నారు. తాజాగా ఈ షో నుంచి అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

‘అఖండ'తో హిట్ ట్రాక్ ఎక్కేశారు
నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'అఖండ'. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్ ఇందులో హీరోయిన్. శ్రీకాంత్ ఈ చిత్రంలో విలన్‌గా నటించాడు. థమన్ దీనికి సంగీతం అందించాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాతో బాలయ్య హిట్ ట్రాక్ ఎక్కారు.
Bigg Boss 5 Winner: ఐదో సీజన్ విన్నర్ అతడే.. రన్నర్ విషయంలో బిగ్ ట్విస్ట్.. ఫినాలే ఊహించని విధంగా!

అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షో అని
అరవై ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా కనిపించే నందమూరి బాలకృష్ణ.. అరవై ఏళ్ల ఏజ్‌లోనూ ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'Unstoppable with NBK' అనే టాక్ షోతో ఓటీటీలోకి వచ్చారు. ఆహా సంస్థ దీన్ని రూపొందించింది. దీపావళి పండుగను పురస్కరించుకుని నవంబర్ నెలలో ఈ టాక్ షోను గ్రాండ్‌గా మొదలు పెట్టేసింది.

ఐదు ఎపిసోడ్స్.. అన్నీ సూపర్ హిట్
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'Unstoppable with NBK' షో నుంచి ఇప్పటి వరకూ ఐదు ఎపిసోడ్స్ వచ్చాయి. మొదటి దాంట్లో మోహన్ బాబు ఫ్యామిలీ, రెండో దానిలో నేచురల్ స్టార్ నాని, మూడో ఎపిసోడ్లో బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, నాలుగో దానిలో అఖండ మూవీ యూనిట్, ఐదో ఎపిసోడ్లో రాజమౌళి, కీరవాణి వచ్చారు. ఇవన్నీ సూపర్ సక్సెస్ అయ్యాయి.
Pushpa 2Days Collections: రెండో రోజు పుష్ప సంచలనం.. పవన్ రికార్డు బద్దలు.. ఇదేం కొట్టుడు సామీ!

బాలయ్యలో కొత్త కోణాన్ని చూపించి
దాదాపు నలభై ఏళ్లుగా సినిమాల్లో ఉన్న నందమూరి బాలకృష్ణ.. ఇప్పటి వరకూ ఎన్నో రకమైన చిత్రాల్లో రకరకాల పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించారు. అలాగే, ఇప్పుడు 'Unstoppable with NBK' షోలో హోస్టుగా మరింతగా అలరిస్తున్నారు. స్టార్ హీరోనే అయినా అందరితో సరదాగా ఉంటూ.. పంచులు వేస్తూ.. డ్యాన్సులు చేస్తూ కొత్త కోణం చూపించారు.

ఆ సెలెబ్రిటీలను తీసుకొచ్చేందుకు
ఆహా సంస్థ కోసం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'Unstoppable with NBK' షో సూపర్ డూపర్ హిట్ అవడంతో.. నిర్వహకులు మరిన్ని ప్రయోగాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగానే మరికొంత మంది సెలెబ్రిటీలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే, స్టార్ హీరోలను కూడా ఇందులో భాగం చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది.
Pushpa Deleted Scene: రష్మిక ప్రైవేటు పార్ట్‌పై బన్నీ చేయి.. సుకుమార్ దృష్టికి వెళ్లడంతో అలా!

బాలకృష్ణతో జత కట్టేసిన రవితేజ
'Unstoppable with NBK' షోలో భాగంగా ఈ వారం ప్రసారం కానున్న ఆరో ఎపిసోడ్ కోసం మాస్ మహారాజా రవితేజ, యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని గెస్టులుగా వచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. ఇందులో వీళ్లు ముగ్గురు ఆటపాటలతో అదరగొట్టినట్లు ఆ పిక్స్ చూస్తే అర్థం అవుతోంది. దీంతో ఈ ఎపిసోడ్‌పై అంచనాలు పెరిగాయి.