రవితేజ మళ్ళీ రెడీ
కిక్ చిత్రంతో జోరుమీదున్న రవితేజ మరో చిత్రం అప్పుడే రెడీ అయిపోయింది. ఆంజనేయులు పేరుతో రెడీ అవుతున్న ఈ చిత్రం ఆగస్టు పన్నెండున రిలీజు చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో హీరో రెండు సంవత్సరాల కొకసారి తప్ప సినిమాలు చేయని ఈ రోజుల్లో ఒకే ఏడాదిలో వరసగా సినిమాలు గ్యాప్ లేకుండా చేయటం గ్రేటే అంటున్నారు. రవితేజ, నయనతార హీరో, హీరోయిన్స్ చేస్తున్న ఈ చిత్రంలో రవితేజ హెచ్.ఎం.టీవీ ఛానెల్ రిపోర్టర్ గా కనపడి అల్లరి చేయనున్నాడు.
నయనతార తన అందచందాలు దుబాయి శీను సరసన ఆరబోయటానికి రెడీ అయిపోతోంది. ఇక యువత చిత్రంతో తానేమిటో నిరూపించుకున్న పరుశరామ్ ఈ చిత్రంతో పెద్ద డైరక్టర్ల జాబితాలో చేరిపోతాడని టాక్. హాస్య నటుడు గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. కమర్షియల్ విలవలన్నిటినీ కలిపి ఈ స్క్రిప్టుని దర్సకుడు రెడీ చేసుకున్నట్లు చెప్తున్నారు. పూరీ శిష్యుడైన పరుశరామ్ ఈ చిత్రంతో తానేమిటో నిరూపించుకుని స్టార్స్ తోనే తన ప్రయాణం కొనసాగించాలనుకుంటున్నాడు. ఇక రవితేజ తన తర్వాత చిత్రాన్ని కృష్ణ వంశి దర్శకత్వంలో చేయటానికి కమిట్ అయ్యారు.


Click it and Unblock the Notifications











