రవితేజ ‘వీర’ స్సీడ్ మీద ఉన్నాడు!
టాలీవుడ్ లో తమ, తమ సినిమాలను పూర్తిచేసే హీరోల్లో రవితేజ కూడా ఒకరు. నిజానికి ఒక సినిమాని అంత వేగంగా పూర్తి చేసే విషయంలో రవితేజ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు అంటే నమ్మసఖ్యం కాదు. ప్రస్తుతానికి 'డాన్ శీను" సినిమా షూటింగ్ కి శుభం కార్డు వేసే పనుల్లో బిజీగా ఉన్న రవితేజ, 'మిరపకాయ" సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ రెండు చిత్రాలు దాదాపు చివరి దశకు చేరుకున్న నేపధ్యంలో, తాజాగా రవితేజ తన తదుపరి సినిమా నిర్మాతలకు పక్కా షెడ్యూల్ తో సిద్దంగా ఉండమని సూచిస్తున్నాడట. టాలీ టు హాలి ఫిలింస్ పతాకంపై రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి 'వీర" అనే టైటిల్ ని ఖరారు చేశారు. 'వీర" షూటింగ్ జూలై 22 నుండి మొదలవుతుందని సమాచారం.
రవితేజ డాన్ శీను శ్రియ మిరపకాయ వీర రమేశ్ వర్మ టాలీ టు హాలీ ఫిలింస్ ravi teja don seenu shriya mirapakaya veera ramesh varma


Click it and Unblock the Notifications