రవితేజ ‘బలుపు’ ముహూర్తం ఖరారు
హైదరాబాద్: మాస్ మహరాజా రవితేజ తన బాడీలాంగ్వేజ్‌కు, ఇమేజ్‌కు తగ్గట్టుగా 'బలుపు' అనే మరో విభిన్న టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇంతకు ముందు రవితేజతో 'డాన్‌శీను' చిత్రాన్ని రూపొందించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది.
పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ పొట్లూరి నిర్మించనున్న ఈ చిత్రం షూటింగుకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్లో ఈచిత్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా సెలక్ట్ అయింది. సంగీత దర్శకడు తమన్ ఈ చిత్రానికి సూపర్ హిట్ ఆడియో అందించేందుకు కృషి చేస్తున్నాడు.
ఈ చిత్రంలో రవితేజ క్యారెక్టర్ కామెడీని పండిస్తూ యాక్షన్ సీన్లతో అదరగొట్టేదిగా ఉంటే...శృతి హాసన్ క్యారెక్టర్ రవితేజకు తగిన జోడీగా ఎంటర్ టైన్మెంట్ పంచుతూ అందాల ఆరబోతతో గ్లామరస్‌గా ఉంటుందని తెలుస్తోంది. దర్శకుడు గోపీ చంద్ ఈ చిత్రం కోసం ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్ స్క్రిప్టును రెడీ చేస్తున్నాడు.
ప్రస్తుతం రవితేజ 'సార్ వచ్చారు' చిత్రంలో నటిస్తున్నారు. శృతి హాసన్ ప్రస్తుతం ప్రభుదేవా హిందీలో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











